Constituency News

భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్‌ ఫార్మా విజన్‌: ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇంపాక్ట్స్‌’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …

Read More »

హరితహారం కోసం స్థలాలు ఎంపిక చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోని చెరువు కట్టలు, కాలువల గట్ల స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇరిగేషన్‌, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారిగా హరిత హారంలో …

Read More »

కామారెడ్డిలో అగ్ని ప్రమాదం

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్‌ రోడ్‌లో గల కోకా దుకాణాల వెనుక భాగంలో రైల్వే స్టేషన్‌ ప్రక్కనుంచి ఓరియంటల్‌ స్కూలు వరకు అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, పొదలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని మంటలు చేలరేగి మొత్తం వ్యాపించాయి. సకాలంలో స్థానికుల సమాచారం మేరకు ఫైరింజన్ల సహాయంతో నీళ్ళు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. చిరు …

Read More »

గ్రూప్స్‌ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్‌ శిక్షణ తరగతులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌ జితేష్‌ వి పాటిల్‌ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న ఉద్యోగ ప్రకటనలకు …

Read More »

సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనది

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం అర్థశాస్త్ర విభాగంలో జరిగిన ఫీల్‌ ది న్యూ అరోమా కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య.డి.రవీందర్‌ ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులనుద్దేశిస్తూ ప్రసంగిస్తూ సామజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఉన్నతమైనదన్నారు. ఆర్థిక వేత్తలు దేశానికి అభివృద్ధి నమూనా తయారుచేసి దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమానికి అతిథిగా బుద్ధా మురళి హాజరై విద్యార్థులు అకడెమిక్‌ జ్ఞానంతో పాటుగా నిత్యజీవితంలో ఎదురయ్యే …

Read More »

సాగు రంగానికి ప్రభుత్వ బాసట

బాన్సువాడ, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం సేద్యపు రంగానికి పూర్తి బాసటగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ తోడ్పాటుతో తెలంగాణలో సాగు రంగం గణనీయంగా వృద్ధి చెంది దక్షిణ భారత దేశం మొత్తానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని అన్నారు. నిజాంసాగర్‌ ప్రధాన కాల్వను ఆధారంగా చేసుకుని …

Read More »

అనాధ బాలికకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి కేంద్రంలోని అనాధ ఆశ్రమంలో శిరీష (13) బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి 3 యూనిట్ల ఓ నెగిటివ్‌ రక్తం అవసరం ఉన్నదని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన కిరణ్‌ 47 వ సారి, టేక్రియాల్‌ గ్రామానికి చెందిన రాజు 4వ సారి వీ.టి ఠాకూర్‌ రక్తనిధి …

Read More »

తెలంగాణ అన్ని కులాల, మతాల సమ్మిళితం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం అన్ని కులాల,మతాల సమ్మిళితమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్ని …

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె ఆర్‌ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్‌ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల …

Read More »

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »