కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. …
Read More »సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు
బాన్సువాడ, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సిఆర్పిలను, సమగ్ర శిక్ష ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోనాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీలకు పే స్కేల్ వేతనంతోపాటు ఆరోగ్య భీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »సౌదీలో హింసిస్తున్నారు.. వాపస్ తెప్పించండి !
హైదరాబాద్, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని రక్షించి వాపస్ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ఈమేరకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, …
Read More »ఇందిరమ్మ ఇళ్ళ సర్వే పక్కాగా నిర్వహించాలి
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారురాలు పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్‌లో పొందుపరచాలని తెలిపారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లుతో పాటు …
Read More »గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. గ్రూప్ 2 రెండవ రోజున జరిగిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం రోజున తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటుచేసిన మౌలిక సదుపాయాలు త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, మెడికల్ సేవలు పై చీఫ్ …
Read More »ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి…
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ జీ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అంగన్ వాడీ భవనాలు, తదితర సమస్యలపై అర్జీలను దరఖాస్తు దారులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను …
Read More »ఆలూర్‌లో ఘనంగా మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో ఆదివారం కండె రాయుడు మల్లన్న జాతర, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ, మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్రామం, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో పాటు రంగురంగు బంతిపూలతో అందంగా షిడి (రథం) ను డప్పు, కుర్మా …
Read More »తాడువాయిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం
కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడువాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శబరిమాత ఆశ్రమంలో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆశ్రమం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద …
Read More »ఘనంగా దత్త జయంతి వేడుకలు
బాన్సువాడ, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో దత్త జయంతిని పురస్కరించుకొని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న దత్తాత్రేయ ఆలయంలో వేద పండితులు గోవింద్ శర్మ అర్చకత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తాత్రేయుని మహిమలపై భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉద్ధేర హన్మాండ్లు, నాగ్లూరి శ్రీనివాస్ గుప్తా, …
Read More »చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే
కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు సమయంలో వారి పేరుపై ప్రమాదబీమా, ఎల్‌ఐసి ఇన్సూరెన్స్ పాలసీ బిఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజుల క్రితం …
Read More »