Constituency News

మీసేవ ద్వారా మేడారం ప్రసాదం పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం సమ్మక్క-సారాలమ్మ ప్రసాదాన్ని మీ సేవ కేంద్రాల ద్వారా అందించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని కామారెడ్డి జిల్లా మీ సేవ జిల్లా మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం పొందాలనుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రాలలో రూ.225 చెల్లిస్తే కొరియర్‌ ద్వారా నేరుగా ఇంటికే అందజేస్తారని చెప్పారు. ఇందులో …

Read More »

టీయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ గా డా. భ్రమరాంబిక

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. భ్రమరాంబిక నియామకం పొందారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ కె. శివశంకర్‌ జారీ చేశారు. డా. భ్రమరాంబిక ఇది వరకు పీజీ కాంఫిడెన్షియల్‌ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, కాంపిటేటీవ్‌ సెల్‌ డైరెక్టర్‌గా, పబ్లికేషన్‌ …

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

వర్ని, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్‌, పైడిమల్‌, నంకోల్‌ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల …

Read More »

కోవిద్‌ కాలం ద్వారా జండర్‌ వివక్ష ఇంకా కొనసాగుతుందని నిరూపితమైంది

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం డైరెక్టర్‌ డా. కె. అపర్ణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘జండర్‌ ఈక్వాలిటీ – ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌’’ (జండర్‌ సమానత్వం – సమస్యలు, సవాళ్లు) అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్‌ విభాగం విశ్రాంతాచార్యులు, సోషల్‌ సైన్స్‌ డీన్‌ ఆచార్య తోటా జ్యోతీ రాణి విచ్చేసి …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం – దంపతుల మృతి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్‌ పంపు వద్ద డీసీఎం వ్యాన్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రమేశ్‌ (46), సరస్వతి (38)గా గుర్తించారు. వీరి స్వస్థలం మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నష్కల్‌. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …

Read More »

అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్‌ కాలనిలో నిర్మించిన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్‌ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్‌ బెడ్‌రూమ్‌ …

Read More »

మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు …

Read More »

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా …

Read More »

18న మేడారం వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్‌ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

22 నుంచి బి.ఎడ్‌. ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాలలోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్డ్‌ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »