ఆర్మూర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎక్సైజ్ సిఐగా స్టీవెన్ సన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ సభ్యులు సన్మానించారు. బుధవారం పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా నవనాథ పురం ప్రెస్ క్లబ్ ఆర్మూర్ గౌరవ అధ్యక్షులు సాత్పుతే శ్రీనివాస్, అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ జాఫర్ అలీతో పాటు కార్యవర్గ సభ్యులు నూతనంగా …
Read More »ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత
హైదరాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికై బుధవారం శాసనమండలిలో సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి భవనంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ్యులతో కలిసి పాల్గొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రెండవసారి ఎంఎల్‌సిగా ఎన్నికై …
Read More »నిరుద్యోగ భృతి ఇవ్వాలి
నసురుల్లాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వారి పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారికి అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ …
Read More »మార్చి 15 లోపు మిల్లింగ్ పూర్తి చేయిస్తాము…
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లు యజమానులతో మార్చి 15 లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్‌తో టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతిరోజు లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు మిల్లింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని …
Read More »జిల్లా మత్స్య శాఖ అధికారిగా శ్రీపతి
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి. శ్రీపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు ఇక్కడ మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లుకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. …
Read More »ప్రథమ స్థానంలో కామారెడ్డి
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సి విద్యార్థులను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. షెడ్యూల్ …
Read More »రాంపూర్‌లో సిసి కెమెరాల ఏర్పాటు …
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం 18వ తేదీ నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పూర్ గ్రామ ప్రజలు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ కళా బృందం పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఆవశ్యకత వివరిస్తూ ఒక్క సీసీ కెమెరా …
Read More »బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండేళ్ళ క్రితం బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తు మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి…. రెండు సంవత్సరాల క్రితం 7వ తేదీ ఆగష్టు 2020 రోజున నిందితుడు విభూతి సాయిలు బీబీపేట్ మండలానికి చెందిన 10 సంవత్సరాల చిన్న పిల్లవాడిని బీబీపేట్ గ్రామ శివారులో, బీరప్ప గుడి …
Read More »పలువురు అధ్యాపకులకు పాలనా పదవుల బాధ్యతలు
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు పాలనా పరమైన బాధ్యతలలో నియామకం పొందారు. వైస్ చాన్స్‌లర్ చాంబర్ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా మంగళవారం అధ్యాపకులు నియామక పత్రాలను పొందారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా. …
Read More »గుండెపోటుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతి
డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్ సౌత్ క్యాంపస్‌లో గల మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) గా బాధ్యతలు అందిస్తున్న డా. వి. లక్ష్మణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డా. వి. లక్ష్మణ్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య …
Read More »