Constituency News

గుండెపోటుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో గల మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) గా బాధ్యతలు అందిస్తున్న డా. వి. లక్ష్మణ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డా. వి. లక్ష్మణ్‌ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య …

Read More »

డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు పి.డి.ఎఫ్‌. సీటు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం.బి.ఎ. పూర్వ విద్యార్థి, పూర్వ పరిశోధకుడు డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ ఆఫ్‌ రీసర్చ్‌ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెల్లోగా ప్రవేశం లభించింది. ఎం.బి.ఎ. విభాగపు ప్రొఫెసర్‌ డా. కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌, ఫైనాన్సింగ్‌, డివిడెంట్‌ డిసిషన్‌ ఆన్‌ ద …

Read More »

కల్లా కపటం లేని నాయకురాలు కామ్రేడ్‌ వినోద

బోధన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని దేవిగల్లీలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్‌ వినోద ప్రథమ వర్ధంతి నిర్వహించారు. సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ కామ్రేడ్‌ వినోద కల్లాకపటం లేని మనిషి అని కొనియాడారు. ఆమె ఇంటికి ఎవరు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడేదని, ప్రేమతో పలకరించేదని అన్నారు. కామ్రేడ్‌ వినోద మహిళలు ఎదుర్కొంటున్న …

Read More »

బాలు సేవలు అభినందనీయం

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ ఎన్‌.టి.రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు 65 వ సారి రక్త దానం చేశారు. టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు బాలును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా …

Read More »

మిల్లింగ్‌ ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లు యజమానులు యాసంగి ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేసే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సివిల్‌ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్‌ మిల్లుల వారిగా మిల్లింగ్‌ చేసిన వివరాలపై సమీక్ష చేపట్టారు. రైస్‌ మిల్లుల వారీగా మిల్లింగ్‌ …

Read More »

ఎంతో ఎదురు చూశారు.. కానీ ఆ ఊసే లేదు…

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) భిక్కనూరు శాఖ ఆధ్వర్యంలో ఖాళిగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగాల భర్తీ విషయమై స్పష్టత వస్తుందని …

Read More »

కాంగ్రెస్‌లో చేరిన భవానిపేట నాయకులు

మాచారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మాచారెడ్డి మండలం భవాని పేట గ్రామానికి చెందిన పలువురు టిఆర్‌ఎస్‌, బిజెపికి చెందిన కార్యకర్తలు కామారెడ్డి నియోజకవర్గ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మొహమ్మద్‌ నయీమ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరు టిఆర్‌ఎస్‌ పార్టీ వాగ్దానాలకే పరిమితం కానీ చేతలకు దూరంగా ఉంటున్నందున ఆ పార్టీ పైన విరక్తి చెంది, రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో, మన …

Read More »

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోటీలు

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, షార్ట్‌ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా …

Read More »

27న రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికలు

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న మండల స్థాయిలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులకు సెల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా డా. రవీందర్‌ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) కో ఆర్డినేటర్‌గా అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ నియామక ఉత్తర్వును జారీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »