ఆర్మూర్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై పోలీస్ స్టేషన్‌లో టిఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కేసీఆర్ అభిమానులను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని కుట్ర చేస్తున్న ఎంపీ అరవింద్ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ మండల, పట్టణ …
Read More »రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్, తాసిల్దార్ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్ గౌడ్, …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆయన సోమవారం ప్రజావాణికి హాజరై మాట్లాడారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి …
Read More »పోటీతత్వంతో కూరగాయలు పండిరచాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం పంటల మార్పిడి విధానంపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పోటీ తత్వంతో కూరగాయ పంటలు పండిరచాలని సూచించారు. …
Read More »కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త సంవత్సరం 2022 లో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. సభాధ్యక్షత వహించిన బార్ …
Read More »తాత్కాలికంగా నుమాయిష్ వాయిదా
హైదరాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించడంతో, నుమాయిష్‌గా ప్రసిద్ధి చెందిన వార్షిక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 10 వరకు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి జనవరి 10 వరకు మత, రాజకీయ మరియు సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక …
Read More »సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కోసం పోరాడిన మానవతా వాదిగా, సావిత్రిబాయి పూలేను కొనియాడారు. అన్ని …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక..
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇటీవల విడుదల అయిన యుజి 3వ, 4వ రెగులర్ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్, రీకౌంటింగ్ సంబందించిన అప్లికేషన్లను విద్యార్థులు వారి కళాశాలలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.
Read More »సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్ డైరెక్టర్ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …
Read More »వెంకటరమణా రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు …
Read More »