Constituency News

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న 2 వేల 500 కోట్ల ఫీజురీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని పి.డి.ఎస్‌.యూ జిల్లా ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్‌, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షులు వి.సాయినాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్ధులతో రైల్వే కమాన్‌ నుండి డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయం వరకు …

Read More »

రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని నవీన్‌, భానుప్రసాద్‌ సహకారంతో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు, సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న …

Read More »

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటలుగా పొద్దుతిరుగుడు, మినుము, శనగ, నువ్వులు, …

Read More »

టీయూ తాత్కాలిక రిజిస్ట్రార్‌గా ఆచార్య శివశంకర్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఆచార్య కె. శివశంకర్‌ నియమితులైనారు. అందుకు సంబంధించిన నియామక పత్రాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గురువారం ఉదయం వీసీ చాంబర్‌లో అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అప్పటికి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య ఎం. యాదగిరి వద్ద నుంచి రిజిస్ట్రార్‌ చార్జ్‌ స్వీకరించారు. ఇదివరకు రెండు పర్యాయాలు రిజిస్ట్రార్‌ బాధ్యతలు స్వీకరించి, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో …

Read More »

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన వరిని భారత ప్రభుత్వం ఎఫ్‌సిఐ సేకరించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామాల్లో బుధవారం ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. యాసంగిలో వరి ధాన్యానికి వరి కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. …

Read More »

కరోనా రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్‌ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వచ్చే అవకాశం ఉన్నందున …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్‌ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం …

Read More »

పరీక్షా కేంద్రాల తనిఖీ

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆర్మూర్‌లో డిగ్రీ 5వ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్ష కేంద్రాలు అయిన గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, నరేంద్ర డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విసి వెంట పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య యమ్‌ అరుణ, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయగౌడ్‌ ఉన్నారు.

Read More »

తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఓ నెగెటివ్‌ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …

Read More »

కోవిడ్‌ టీకా కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్‌ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్‌ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్‌ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్‌ సెషన్స్‌ కొనసాగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ అదేశానుసరం ఐసీడీఎస్‌, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో ప్రత్యేక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »