కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులతో మాట్లాడారు. అర్హత గల ప్రతి స్వయం సహాయక …
Read More »తప్పులుంటే సరిదిద్దుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్ లెవల్ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్ …
Read More »ఉచిత న్యాయసేవ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు …
Read More »భూ వివాదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్ లేకుండా చూసుకోవాలని …
Read More »ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణాన్ని రాసింది వాల్మీకి …
Read More »పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని …
Read More »న్యాయవాదుల సహకారంతోనే సత్వర పరిష్కారాలు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాదుల సహకారంతోనే సత్వర కేసుల పరిష్కారం జరుగుతుందని, బార్ బెంచ్ సంబంధాలు పటిష్టంగా ఉంటేనే, అందరికీ సమన్యాయం జరుగుతుందని కామారెడ్డి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో …
Read More »రూరల్ ఇన్నోవేషన్ హబ్ భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్
డిచ్‌పల్లి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులో కాకతీయ సాండ్ బాక్స్ వారు ఏర్పాటుచేసిన రూరల్ ఇన్నోవేషన్ హబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ సాండ్ బాక్స్ నుండి చాలా ప్రాజెక్టులు చేయడం వ్యవసాయం, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య అందులోనూ రూరల్ ఏరియాలో బాగా ఉపయోగపడే అవకాశం …
Read More »వరికోత మిషన్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ఆర్మూర్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు వరి కోత కట్టింగ్ హార్వెస్టింగ్ మిషన్‌ను జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్, డిసివో సింహాచలం, డిఎం సివిల్ సప్లయ్ అబిషేక్, పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం బొజరెడ్డి, ఏడిఏ హరికృష్ణ, తహసిల్దార్ వేణు గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లడుతూ వరి …
Read More »రక్తదాన శిబిరం విజయవంతం
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్, …
Read More »