కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్‌తో మృతిచెందిన ఇద్దరు ఐకేపీ సమన్వయకర్తల కుటుంబాలకు రూ.1.50 లక్షల చెక్కులను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అందజేశారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఐకేపీ సమన్వయకర్తలు విజయ్ కుమార్, నరేష్ కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.
Read More »అందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి…
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కేంద్రాల వారీగా కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. 100 శాతం …
Read More »క్రీడాకారులకు ఆర్థిక సహాయం
బాన్సువాడ, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో 4వ జాతీయ స్కూల్ గేమ్స్ ఛాంపియన్ షిప్ 2021 గోవాలో జరగనున్న ఛాంపియన్ షిప్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వెళ్తున్న తెలంగాణ జట్టులోని బాన్సువాడ క్రీడాకారులకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అందజేశారు. తెలంగాణ నుండి ఎంపికయిన కామారెడ్డి జిల్లా బాల, …
Read More »మునిసిపల్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి
బోధన్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య
కామారెడ్డి, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »మంచినీరు పేరుతో మురికి నీరు అందించడం సిగ్గుచేటు
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో వచ్చే గోదావరి జలాలు మురికి నీరు కంటే అధ్వానంగా రావడం జరుగుతుందని, ఈ నీళ్లు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని కామారెడ్డి జిల్లా బిజెపి మీడియా అనుబంధాల కన్వీనర్ విశ్వనాధుల మహేష్ గుప్తా అన్నారు. మున్సిపల్ అధికారులు మంచినీరు సరఫరా చేయాల్సింది పోయి మురికి నీరు సరఫరా చేయడం సిగ్గుచేటని ప్రజల నుండి …
Read More »దోమలు ఉత్పత్తి కాకుండా ఆయిల్ బాల్స్
ఆర్మూర్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్, సిక్కుల కాలనీలలో రోడ్డుకు ఇరువైపుల వున్న డ్రైనేజీలలో, మురికి గుంటలలో దోమలను వాటి గుడ్లను (లార్వా) లను అంతం చేయడానికి ప్రాచీన పద్దతిలో ఆయిల్ బాల్స్ వేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన …
Read More »లింగంపేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం లింగంపేట్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గరిబ్‌ఉనిస నయీమ్, జడ్పిటిసి శ్రీలత సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజవాడ నరహరి మాట్లాడుతూ బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకువచ్చిన అద్భుత పథకం అన్నారు. ఇవే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నేరుగా నిరు పేదలకు అందేట్టుగా …
Read More »వర్షాల కారణంగా నష్టపోయిన పంటలు పరిశీలించిన అధికారులు
వేల్పూర్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో గతనెల 28, 29 న కురిసిన భారీ వర్షాల కారణంగా పచ్చల నడుకుడ పెద్దవాగుపై నిర్మించిన చెక్ డాం తెగిపోవడం వలన భూమిని, పంటను కోల్పోయిన రైతుల పంటపొలాలను మండల వ్యవసాయ అధికారి నరసయ్య, సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నష్టపోయిన రైతుల పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో చదవాలని ఓయు ప్రొఫెసర్ డాక్టర్ రాము షెఫర్డ్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షకు సంబందించిన వైవా కార్యక్రమానికి ఆయనతో పాటు సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా కళాశాలలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎస్‌డబ్ల్యు వృత్తి విద్యా కోర్సులో …
Read More »