Constituency News

కామారెడ్డి చేరిన ప్రజా సంగ్రామయాత్ర

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్‌ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్‌ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర …

Read More »

సర్వే చేసిన ఇళ్ళకు స్టిక్కర్లు అతికించాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌ రావు అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. సబ్‌ సెంటర్‌ వారీగా గ్రామాలను గుర్తించి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని కోరారు. మున్సిపల్‌ పరిధిలో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి 100 శాతం వ్యాక్సినేషన్‌ చేయించుకునే …

Read More »

ఇవిఎం గోదాము నిర్మాణాల పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్‌ గోడౌన్‌ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజేశ్వర్‌ రెడ్డి, ఈఈ రవిశంకర్‌, డిఈ శ్రీనివాస్‌, జెఈఈ రవితేజ, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ ఉన్నారు.

Read More »

కామారెడ్డి జడ్పి సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశం జడ్పీ చైర్‌ పర్సన్‌ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ …

Read More »

వ్యాక్సినేషన్‌ కోసం ఇంటింటి సర్వే చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్‌ జితీష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ వేయాలని …

Read More »

ఫాలిహౌజ్‌లు పరిశీలించిన ఉద్యానవన జిల్లాధికారి

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ గ్రామానికి మంజురైన పాలీహౌస్‌లను మంగళవారం ఉద్యానవన జిల్లాధికారి సంజీవ్‌ రావు పరిశీలించారు. ఉద్యానవన శాఖ ద్వారా నేరల్‌ గ్రామానికి 5 ఫాలిహౌజ్‌ మంజూరు కాగా వాటిని పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. గ్రామంలోని సాయిలు, జాదవ్‌ పూలబాయి, శ్రవణ్‌, గోపాల్‌, దేవీసింగ్‌లకు చెందిన ఫాలిహౌజ్‌లలో పండిస్తున్న చామంతి తోటలను పరిశీలించారు. ఒక ఎకరం ఫాలిహౌజ్‌లో …

Read More »

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి…..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ఖైరతాబాద్‌ వినాయకుని దర్శించుకున్న ఎంపి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్‌ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ …

Read More »

నిబంధనలు పాటించని బి.ఎడ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్‌ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి …

Read More »

15న ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్‌ 15వ తేదీ బుధవారం ఉంటుందని దోస్త్‌ సమన్వయకర్త డాక్టర్‌ కె.సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 వరకు కొనసాగే సర్టిఫికెట్ల పరిశీలనతో కూడిన ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు పిహెచ్‌. సిఏపి, ఎన్‌సిసి, ఎక్స్‌ట్రా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »