Constituency News

అర్థశాస్త్రం విభాగంలో రవీందర్‌ నాయక్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలోని పరిశోధకులు ఎం. రవీందర్‌కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డ్‌ ప్రదానం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.బి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎం. రవీందర్‌ ‘‘తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు – ప్రత్యేక అధ్యయనం, నిజామాబాద్‌ జిల్లాలోని లంబాడాలకు పరిమితం’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. …

Read More »

జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గం

మోర్తాడ్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండల నూతన జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులుగా కె సురేష్‌ గౌడ్‌, ఎండి సాదిక్‌ ఆధ్వర్యంలో అందరి అభిప్రాయం మేరకు ఏర్పాటు చేశారు. మోర్తాడ్‌ మండల జర్నలిస్టుల సంఘం నూతన అధ్యక్షులుగా బండి నారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ గంగాధర్‌, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ హుస్సేన్‌, ఉప కార్యదర్శి గట్టు …

Read More »

భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య కేంద్రాల పనుల పురోగతిపై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని కోరారు. పనులు చేపట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా …

Read More »

విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాయీ బ్రాహ్మణులకు, రజకులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోబీ ఘాట్‌, లాండ్రీ షాప్‌, సెలూన్‌ల కోసం విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు ఆరు వందల ఇరవై నాలుగు మంది లబ్ధిదారులు …

Read More »

హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలి

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే 164 పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో సోమవారం జాతీయ రహదారి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైవేలో భూములు పోయిన రైతులకు పరిహారం అందించాలని సూచించారు. రోడ్డు వెడల్పు పనుల కోసం ఫారెస్ట్‌, నేషనల్‌ హైవే అధికారులు సంయుక్త …

Read More »

యూరియా పంపిణీలో ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియా పంపిణీలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా లీడ్‌ బ్యాంకు అధికారితో జిల్లాలో యూరియా సరఫరా, పంపిణీ పరిస్థితులను, పంట రుణాల ఖాతాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాకు వచ్చిన యూరియాను …

Read More »

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకుడు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బి పాజిటివ్‌ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డిని ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించగా మిత్రుడు …

Read More »

మోడీ ప్రభుత్వానికి కామారెడ్డి రైతుల కృతజ్ఞత

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు …

Read More »

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

నందిపేట్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో సోమవారం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా తోటి ఆదివాసి సేవా సంఘం కుల సభ్యులు కొమురం భీమ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కొడపల్‌ గణేష్‌ మాట్లాడుతూ కొమురం భీమ్‌ ఆదివాసుల హక్కుల కొరకు పోరాడిన మహా …

Read More »

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »