నవీపేట్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీవర్షాలకు నవీపేట్ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో గల ఊరచెరువు జలకళ సంతరించుకుంది. మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో జన్నెపల్లి గ్రామ చెరువు, వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాలకు నీరు అందించే చెరువు నిండడంతో సాగునీటికి …
Read More »పరీక్షలు వాయిదా…
డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 22వ తేదీ గురువారం నుండి ప్రారంభం కావాల్సిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్, 2వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు పేర్కొన్నారు. 22, 23, 24వ తేదీలలో జరగాల్సిన డిగ్రీ, పిజి, బిఎడ్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలపగా, …
Read More »అత్యవసర సమయంలో రక్తదానం
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆక్సిడెంట్ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌లో మెస్సేజ్ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్ కుమార్ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. …
Read More »జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »25న ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మ జ్యోతిబా పూలె బిసి సంక్షేమ గురుకుల కళాశాల (టిఎస్‌ఎంజెబిసి) ఇంటర్, డిగ్రీ కోర్సులలో ప్రవేశ పరీక్ష ఈ నెల 25 న ఉదయం 10 గంటలనుండి 12.30 వరకు నిర్వహించబడునని, దీనికి సంబందించిన హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. తప్పని సరిగా మాస్క్ ధరించి …
Read More »త్యాగానికి ప్రతిరూపం..బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో ఇదుల్ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో బక్రీద్ పండుగవస్తుంది. జిల్ హజ్ …
Read More »యువతకు చేరువయ్యేలా పార్టీ సిద్ధాంతాలు
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో పట్టణ ఇంచార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ జిల్లా కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాము మాట్లాడుతూ పోలింగ్ …
Read More »30వ సారి రక్తదానం చేసిన బోనగిరి శివ కుమార్
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్ నిర్వాకులు బోనగిరి శివకుమార్. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు …
Read More »అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అటవీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జరిగిన జిల్లా స్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద …
Read More »