నిజాంసాగర్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం గురించి ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం …
Read More »ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఇద్దరు గల్ఫ్ మృతుల ఇళ్లను సోమవారం సందర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరి పత్రాలు (ప్రొసీడిరగ్స్) అందజేశారు. త్వరలో వీరి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా సొమ్ము నేరుగా జమ అవుతుంది. డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన యదరవేణి రవీందర్ …
Read More »పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
బాన్సువాడ, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన, 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం రాత్రి బిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి ఫూలే రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆయన పరిశీలించారు. వసతి గృహంలో నివసించే విద్యార్థినులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, శుచి కరమైన, రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల చదువు పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని …
Read More »రక్తదానం చేసిన డాక్టర్ ఆర్తి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మీ (65) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఒనెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ ఆర్తి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 9వ సారి ఓ నెగటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్‌క్రాస్ జిల్లా …
Read More »ప్రజావాణి ఆర్జీలు పరిశీలించి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణి లో 70 అర్జీలు వచ్చాయన్నారు. …
Read More »రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
బాన్సువాడ, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించే రోడ్డు నిర్మాణ పనులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు పంట పొలాలకు వెళ్లే వారికోసం 50 లక్షలతో రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి,అంజిరెడ్డి,మాజీ మార్కెట్ …
Read More »29న సర్వసభ్య సమావేశం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.వంశీ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 29 నవంబర్ 2024 న జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2024-25 సంవత్సరం బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ …
Read More »డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు
బాన్సువాడ, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్‌సిసి దినోత్సవ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆర్మీ, నేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఎన్సిసి ఎంతో దోహద పడుతుందన్నారు. కళాశాలలో నూతన ఎన్‌సిసి లాంచ్ చేశారు. కార్యక్రమంలో …
Read More »