Constituency News

రేపు విద్యుత్‌ అంతరాయం

బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌, తాడ్కోల్‌ సబ్‌ స్టేషన్ల పరిధిలో శనివారం సబ్‌ స్టేషన్‌ మరమ్మత్తుల కోసం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్‌ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని రూరల్‌ ఏఈ అనిల్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ వి.విక్టర్‌ అన్నారు. శుక్రవారం తాడ్వాయి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం క్రింద విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, నాణ్యతగా, రుచికరమైన భోజనం పెట్టాలని అన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు ఒకటికి రెండు సార్లు కడగాలని తెలిపారు. వంట వండే సమయంలో ఏమైనా …

Read More »

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్‌ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ శుక్రవారం సందర్శించి, ఇంటింటి సర్వే ద్వారా …

Read More »

3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ -2024 సీజన్‌ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్‌ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్‌ గ్రామంలో సహకార …

Read More »

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో ఏళ్లుగా గల్ఫ్‌ కార్మికులు చేసిన పోరాటం ఫలించింది. సీఎం ఏ. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్‌ ప్రభుత్వం స్పందించింది. గల్ఫ్‌ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఆర్థిక సహాయం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 16న జీవో జారీ చేసింది. లాభోక్తుల ఎంపిక, చెల్లింపు కోసం అక్టోబర్‌ 7న మార్గదర్శకాల జీవో జారీ …

Read More »

యూనివర్సిటీ భూములను రక్షించండి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కబ్జా అయిన తెలంగాణ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకొని, కబ్జాదారుల నుండి రక్షించాలని, యూనివర్సిటీ చుట్టూరా ప్రహరీగోడ నిర్మించుటకై తగు చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడుతూ, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ …

Read More »

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్‌ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌ ఏసిపి, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాస్‌ అలాగే బోధన్‌ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్‌ బిసి డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ నరసయ్య, …

Read More »

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సదాశివనగర్‌ జాతీయ రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్‌ లను ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వ్యాపార రంగంలో రాణించాలని, అన్నారు. మండల …

Read More »

భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నెంబర్‌ 44 ప్రక్కన గల సర్వే …

Read More »

పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు విద్య బుద్దులు నేర్పించాలని, పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కుప్రీయాల్‌ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, సామ్‌, మామ్‌ పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వంటి విషయాలు అడిగారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం, అందించడంతో పాటు, ఆట పాటలు నేర్పిస్తున్నమని, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »