కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ జాగృత దివస్ సందర్బంగా బుధవారం సైబర్ క్రైమ్ డిఎస్పి, స్టాఫ్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా నకిలీ పోలీసు కాల్స్, మ్యూల్ ఖాతాలు, కంబోడియా దేశంలో మానవ అక్రమ రవాణా, ఏపికె ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్, డిజిటల్ అరెస్టుల కుంభకోణాలు, ఇన్వెస్ట్మెంట్స్ (స్టాక్) మోసాలు, …
Read More »గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 7వ తేదీ గురువారం 11 కేవి అశోక్ నగర్, విద్యానగర్ ఫీడర్ పై విద్యుత్ పనులు జరుగనున్నందున, ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు గంటపాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్ 2, కామారెడ్డి ఏ.ఈ. వెంకటేశ్ తెలిపారు.
Read More »దేశ సమగ్రతకు కృషి చేయాలి
డిచ్‌పల్లి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హర్యానా రాష్ట్రంలోని రివరి జిల్లా మీరార్యారులో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన ఎన్‌ఎస్‌ఎస్ వాలెంటర్లును తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరి రావు అభినందించారు. 16 రాష్ట్రాల నుంచి 200 మంది వాలెంటర్లు పాల్గొన్నగా కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ మరియు అనుబంధ కళాశాల విద్యార్థులు నాలుగు పతకాలు సాధించడం గొప్ప విషయమని …
Read More »శాస్త్ర సాంకేతికతకు సాంఖ్యాక శాస్త్రమే మూలాధారం
డిచ్‌పల్లి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు అవగాహన సదస్సు అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, స్టాటిష్టిక్స్ అనుకరణ మరియు ప్రాముఖ్యతను గురించి వివరించారు. …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ తదితర గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. …
Read More »సర్వే పక్కాగా ఉండాలి…
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున తాడ్వాయి మండల కేంద్రం, కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టే సర్వే పక్కాగా ఉండాలని, …
Read More »ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని ఈవీఏం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రోజున స్థానిక ఈవీఏం గోదామును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Read More »రైతులకు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున లింగంపేట్ మండలం కేంద్రం, మంగారం గ్రామం, నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను …
Read More »యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
డిచ్‌పల్లి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు. …
Read More »