Constituency News

నాలుగు సెక్షన్‌లకు ట్రాన్స్‌ కొ ఏఈలు భాధ్యతలు స్వీకరణ

నందిపేట్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రాన్స్‌ కొ సాధారణ బదిలీలలో భాగంగా నాలుగు సెక్షన్‌లకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌లుగా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారని నందిపేట్‌ ఏ. డి. ఈ అశోక్‌ తెలిపారు. నూత్పల్లి సెక్షన్‌ కు జీ రమేష్‌, నందిపేట్‌ కు తూము రవి, మాక్లూర్‌ కు మిథున్‌, గోటుముకల కు సయ్యద్‌ ఇలియాస్‌ హేమద్‌ లు బాధ్యతలు తీసుకున్నారని అశోక్‌ తెలిపారు.

Read More »

రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న పోలీసు ఉద్యోగి

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీ చెందిన డాక్టర్‌ పుట్ల అనిల్‌ కుమార్‌ పోలీస్‌ శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వహించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం జరిగిందని తన జన్మదినాన్ని పురస్కరించుకొని 25వసారి రక్తదానం చేయడం జరిగిందని …

Read More »

దుబాయిలో తప్పిపోయిన హైదరాబాద్‌ యువకుడు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ గౌలిగూడకు చెందిన నూగురు రాహుల్‌ రాజ్‌ (32) అనే యువకుడు ఉద్యోగం కోసం విజిట్‌ వీసాపై దుబాయికి వెళ్లి జాడ తెలియకుండా పోయిన సంఘటన జరిగింది. ఈ నెల 14న దుబాయికి చేరుకున్న తమ కుమారుడు రాహుల్‌ 19న తన బ్యాగ్‌ దొంగలు కొట్టేశారని అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని తమకు ఫోన్‌లో చెప్పాడని, ఆ …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆచార్య. టి. యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తుందని అందుకే అత్యంత పారదర్శకంగా విద్యా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఆచార్యులను మాత్రమే …

Read More »

దరఖాస్తుల విచారణ మిషన్‌ మోడ్‌లో పూర్తిచేయాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల్లో ఓటర్‌ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పనపై జిల్లాల కలెక్టర్‌లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. సమీకృత జిల్లాల సముదాయం …

Read More »

వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లపై ప్రయాణించే ప్రతి వాహనదారులు తప్పనిసరి ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో ఎస్సై మోహన్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అనుసరించి వాహనదారులు వానానికి సంబంధించిన ద్రువపత్రాలతో పాటు, హెల్మెట్‌ తప్పనిసరి ధరించి …

Read More »

తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్‌ గుర్తింపునకు కృషి చేస్తా…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ నూతన వైస్‌ ఛాన్స్లర్‌గా సీనియర్‌ ప్రొఫెసర్‌ .టి .యాదగిరి రావు సోమవారం పరిపాలనా భవనం వైస్‌ -ఛాన్స్లర్‌ ఛాంబర్‌లో పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్‌, కంట్రోలర్‌, ఆడి సెల్‌ డైరెక్టర్‌, డీన్స్‌, హెడ్స్‌, చైర్మన్‌ బిఓఎస్‌ల తొ పాటుగా టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వైస్‌ ఛాన్స్లర్‌ మాట్లాడుతూ …

Read More »

సమస్యలు వచ్చినపుడు కంట్రోల్‌ రూంకు ఫిర్యాదు చేయవచ్చు…

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినపుడు జిల్లా కేంద్రం కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం నెంబర్‌ 08468 220051 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లోని పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూం ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ …

Read More »

ఆర్జీలను పరిశీలించి చర్యలు చేపట్టాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కి వచ్చే దరఖాస్తు దారుల అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు వారి సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల …

Read More »

78 యూనిట్ల రక్త సేకరణ..

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ (ఐవిఎఫ్‌),ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీల ఆధ్వర్యంలో కర్షక్‌ బిఎడ్‌ కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »