బాన్సువాడ, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తన నివాసంలో కోటగిరి, వర్ని, చందూర్ మండలాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్లు గంగాధర్,కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, డిసిసి డెలిగేట్ కొట్టం మనోహర్ ,వైస్ చైర్మన్ అనిల్, సాయిరెడ్డి, నాయకులు …
Read More »వరి పంటను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి …
Read More »పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత …
Read More »చుక్కనీరు వృధా కాకుండా నీటి నిర్వహణ జరగాలి
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రబీ పంటను కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రబీ సాగునీటి సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల …
Read More »మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలి
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు పురుషులతో పోటీ పడాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని …
Read More »తెలంగాణ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది…
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనధికార లే అవుట్లు, వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు, లే అవుట్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2020 ఆగస్టు 31 నాటికి ముందే అనధికార లే అవుట్లలో 10 శాతం …
Read More »విజయం సాధించాలంటే ఆలోచనలో మార్పు రావాలి
డిచ్‌పల్లి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆలోచనలు- అవకాశాలు అనే అంశంపై యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల అధ్యక్షతన విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెసర్, అకాడమిక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ డాక్టర్ వాణి గడ్డం ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. విద్యార్థి జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం బహుముఖ …
Read More »పేద మహిళకు కుట్టు మిషన్ అందజేత
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా చెందిన మహిళకు కుట్టు మిషన్ అవసరమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఆర్యవైశ్య నాయకులు వందనపు శైలేష్ గుప్తా ను సంప్రదించడంతో వెంటనే స్పందించి మనుగుల కుమారికి కుట్టుమిషన్‌ను హైదరాబాద్‌లో అందజేశారు. ఈ సందర్భగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి ఆర్థిక స్వాలంబనతోనే సాధ్యమవుతుందని, వృత్తి …
Read More »ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 8072 మంది విద్యార్థులకు గాను 7921 మంది విద్యార్థులు హాజరు కాగా, 151 మంది …
Read More »ప్రజావాణిలో 101 ఫిర్యాదులు
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి లో (101) …
Read More »