Constituency News

తెలంగాణ విధ్వంసకారుడు కేసీఆర్‌

కేసీఆర్‌ ఉద్యమకారుడు కాదని.. తెలంగాణ విధ్వంసకారుడని విశ్రాంత ఐఏఎస్‌ ఆకునూరి మురళీ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, టీఎస్‌పీఎస్‌సీని, గ్రామ పరిపాలనను, ఇలా అన్ని రకాల వ్యవస్థలను విధ్వంసం చేసిన మహానుభావుడు కేసీఆర్‌గా తెలిపారు. జిల్లాలల్లో కలెక్టర్లను రియల్టర్లుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలలో అత్యధికంగా అవినీతికి పాల్పడే కలెక్టర్లను తీసుకొచ్చి హైదరాబాద్‌, రంగారెడ్డి వంటి జిల్లాలలో పోస్టింగులు ఇచ్చి దోపిడీకి …

Read More »

రేషన్‌ కార్డు ఉన్న వారికే రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌!!

తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా రేషన్‌ కార్డుల సంఖ్య 85.79 లక్షలు ఉంది. రేషన్‌ కార్డుతో గ్యాస్‌ కనెక్షన్లు లింక్‌ చేయగా 63.6 లక్షల కనెక్షన్ల లెక్క తేలింది. వీటికి సంవత్సరానికి 6 లేదా 12 సిలిండర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తుంది.

Read More »

కామారెడ్డిలో అయోధ్య అక్షింతల భారీ శోభాయాత్ర

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో నగరపురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్ర ధర్మశాల నుండి రైల్వే స్టేషన్‌ బాంబే క్లాత్‌ పాన్‌ చౌరస్తా గర్ల్స్‌ హై స్కూల్‌ కోడూరి హనుమాన్‌ మందిర్‌ పెద్ద బజార్‌ మీదుగా నిజాం సాగర్‌ చౌరస్తా నుండి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ …

Read More »

నిత్యావసర సరుకుల పంపిణీ

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గల ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో అధ్వర్యంలో ఫరీద్‌ పెట్‌ గ్రామంలోని ఇంటర్నేషనల్‌ ప్రేయర్‌ ఫెలోషిప్‌ చర్చిలో క్రిస్టమస్‌ వేడుకలు ఘనంగా జరిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎన్జీవో తరఫున నిరుపేద క్రిస్టియన్‌ కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ రత్నం, ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ …

Read More »

ఉత్సాహంగా స్వచ్ఛకాలనీ సమైక్య కాలనీ…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి రెండు గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు, పార్కులోని చెట్ల కొమ్మలను కట్టర్‌తో కత్తిరించారు. ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పారలతో …

Read More »

ముఖ్యమంత్రిగా నేడు తొలి సమావేశం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఆదివారం డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజాపాలన’ …

Read More »

వైభవంగా వైకుంఠ ఏకాదశి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్మూర్‌లో గల విశాఖ కాలనీ నందు గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వారా) దర్శనం పూజ కార్యక్రమం ఉదయం 4 నుండి భక్తుల దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు గౌతం పాండే ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రమా సత్యనారాయణ దేవతామూర్తులకు ఉత్తర ద్వార …

Read More »

కామారెడ్డిలో టుకె రన్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రన్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ …

Read More »

డెంటల్‌ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

బాన్సువాడ, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాకేష్‌ డెంటల్‌ ఆసుపత్రిని శనివారం మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునాతన పరికారాలతో బాన్సువాడ పట్టణంలో డెంటల్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆసుపత్రి నిర్వాహకులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి …

Read More »

ఉత్తమ రైతుకు ఘన సన్మానం

బాన్సువాడ, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శనివారం మండలానికి చెందిన ఉత్తమ రైతు పెండ్యాల సాయిలు ను క్లబ్‌ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేకల విట్ఠల్‌, సంతోష్‌, పోశెట్టి, శ్రీకాంత్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »