renjal

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్‌ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్‌ ఉస్మాన్‌ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …

Read More »

ఎఫ్‌ఎంసీ కంపెనీ ఆధ్వర్యంలో వరి పంటపై అవగాహన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల క్యాంప్‌లో ఎఫ్‌ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి పంటలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రైతు దాసు గారి పొలంలో వారం రోజుల క్రితం ఎఫ్‌.ఎం.సి. వారి కర్ప్రైమ అనే మందును వాడి మోగి పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు పచ్చపురుగులను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు పంట ఏపుగా పెరగడం జరిగింది. ఈ మేరకు …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలపై పరిశీలన

రెంజల్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అమలు తీరుపై శుక్రవారం మండలంలోని దూపల్లి, కూనేపల్లి, కందకుర్తి గ్రామాలలో నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు గంగప్పా, డిఆర్డీఏ అధికారి విజయ్‌లు గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, ఉపాధి హామీ పథకం, పల్లె ప్రకృతి వనాలు, ఐకెపికి సంబంధించిన పనుల వివరాలను తెలుసుకొని …

Read More »

అక్రమ మొరం రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు

రెంజల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మొరంను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమార్కులు టిప్పర్లను జెసిబిలను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు మాత్రం అక్కడి నుండి వాహనాలను కదలనివ్వకుండా భీష్మించుకొని కూర్చున్నారు. అక్రమార్కులు చేసేది ఏమీ లేక ఊరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెసిబిలు, టిప్పర్లను పంపించే ప్రయత్నం చేశారు. దీంతో గంగపుత్రులు, గ్రామస్తులు …

Read More »

ముగ్గుల్లో ప్రభుత్వ పథకాలు

రెంజల్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాలు ముగ్గుల రూపంలో తెలియపరచిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోధన్‌ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా సోమవారం రెంజల్‌ మండల కేంద్రంతో పాటు కందకుర్తి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను …

Read More »

ఎస్‌ఎంసి చైర్మన్‌కు సన్మానం

రెంజల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ గా ఎన్నికైన మమ్మాయి నాగరాజు ను శుక్రవారం సర్పంచ్‌ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, శ్రీకాంత్‌, రాంచందర్‌, సింహారాయులు తదితరులు ఉన్నారు.

Read More »

బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారులకు సన్మానం

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ వినయ్‌ కుమార్‌, డాక్టర్‌ సహిస్థాపిర్దోస్‌లను సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రావణ్‌ కుమార్‌, కరిపే రవీందర్‌, మాలంబి, రాణి, ఆరోగ్య కార్యకర్తలు సిబ్బంది ఉన్నారు.

Read More »

విద్యార్థుల ప్రతిభ వెలికితీతకే బోధనోపకరణాల మేళ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యాబోధనను సమర్థవంతంగా నిర్వహించుటకు అన్ని స్థాయిలలోని విద్యార్థులల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే బోధనోపకరణాల మేళ ఉపయోగపడతాయని ఎంపీపీ రజిని కిషోర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ భవిత దివ్యాంగుల పాఠశాలలో బోధనోపకరణమేలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు వారి ప్రతిభతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కిలకించారు.అనంతరం వారు మాట్లాడుతూ. విద్యార్థుల్లో దాగి ఉన్న …

Read More »

పిఆర్టియు కాలమాని ఆవిష్కరణ

రెంజల్‌, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ దివ్యంగుల పాఠశాలలో మంగళవారం పిఆర్టియు నూతన కాలమానిని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్‌, జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్టియు ఎప్పుడు ముందుంటుందని ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై …

Read More »

వివాహిత ఆత్మహత్య

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట తాండకు చెందిన రాథోడ్‌ శాంతాబాయి (45) అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. మృతురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. ఆమెకు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిరదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »