renjal

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్‌ పట్టివేత

రెంజల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏటువంటి అనుమతులు లేకుండా రెంజల్‌ మండలంలోని నీలా గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను టాస్క్‌ఫోÛర్స్‌ సిఐ శ్రీధర్‌ పట్టుకొని రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ సాయన్న అన్నారు. ఇసుక టిప్పర్‌ డ్రైవర్‌ వసిమ్‌పై కేసు నమోదు చేసినట్లు …

Read More »

ఆదర్శ పాఠశాల తనిఖీ

రెంజల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు గురువారం జిల్లా బాలికల సంరక్షణ అధికారి వనిత తనిఖీ చేశారు. ఆదర్శ పాఠశాలలోని నిత్యవసరల సరుకులను పాఠశాల చుట్టూ పరిశుభ్రతను తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలసారం పాఠశాలను సందర్శించడం …

Read More »

మధ్యాహ్నం భోజనం వికటించి 14మంది విద్యార్థులకు అస్వస్థత

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనంలో ముద్ధ వంకాయకూర వడ్డించారు. సాయంత్రం సమయంలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి రావడంతో కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ బలరాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. …

Read More »

ఉచిత ఎన్‌సిడి మందుల కిట్లు పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దూపల్లి గ్రామంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్‌, బిపి, షుగర్‌, రక్తపోటు గల పేషెంట్లకు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా …

Read More »

పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్‌ఓ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్‌వో విద్య సందర్శించారు. మంగళవారం పాఠశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు బాలికల వసతిగృహంతో పాటు జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిత్యవసర వస్తువులను తనిఖీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ తీరును పరిశీలించారు. అనంతరం …

Read More »

రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసిపి

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక తనిఖీలోనిగా భాగంగా బుధవారం రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ ను బోధన్‌ ఏసీపీ కిరణ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న పలు రకాల రికార్డులతో సిబ్బంది పనితీరును పరిశీలించడం జరిగిందని అన్నారు. పెండిరగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని …

Read More »

తాడ్‌ బిలోలిలో ఆయిల్‌ పంటలపై అవగాహన

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆయిల్‌ పంపండలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో రైతులకు ఆయిల్‌ పామ్‌ పంట సాగుపై అవగాహన కల్పించారు. నూనె గింజల పంటలకు మంచి డిమాండ్‌ ఉన్న కారణంగా ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సహిస్తుందని, ఆయిల్‌ పంట సాగు వలన కలిగే లాభాలను, సాగు …

Read More »

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా అన్నారు. మంగళవారం అంబేద్కర్‌ 66వ వర్ధంతి వేడుకలను సాటా పూర్‌ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని రెంజల్‌, సాటా పూర్‌, వీరన్న …

Read More »

రైతులు పంట మార్పిళ్లపై మొగ్గు చూపాలి

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఒకే రకమైన పంటలు పండిరచకుండా పంట మార్పిళ్లపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేలలోని భూసారాన్ని తగ్గించకుండా ఆర్గానిక్‌ ఎరువులపై దృష్టి సారించాలన్నారు. …

Read More »

అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దండిగుట్ట గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక పాఠశాల పాత బిల్డింగ్‌ను మరమ్మత్తులు నిర్వహించి అంగన్వాడీ కేంద్రానికి అందజేయడంతో సోమవారం అంగన్వాడీ భవనాన్ని ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ ముళ్ళపూడి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »