రెంజల్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దూపల్లి కూనేపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచ్‌లు సాయరెడ్డి, విజయ లింగంలు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత, సీఎం సహాయని ద్వారా చెక్కుల మంజూరుకు …
Read More »సాటాపూర్‌లో దివ్యాంగుల దినోత్సవ వేడుకలు
రెంజల్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని సాటాపూర్ గ్రామంలోని భవిత కేంద్రంలో సర్పంచ్ వికార్ పాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార పాషా మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసి పోరని ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. …
Read More »ఉచిత ఎన్సిడి కిట్లను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్, రక్తపోటు గల రోగులకు …
Read More »ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలి
రెంజల్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునానని జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బోధన్ డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులకు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ మాట్లాడారు. రైతులకు …
Read More »భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్నూర్ నుండి బైంసా వరకు నిర్మించబోయే ఎన్‌హెచ్ 161 జాతీయ రహదారి ఏర్పాటులో భూములను కోల్పోయే రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ రైతులకు భరోసా కల్పించారు. ఆదివారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో రైతులతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.జాతీయ రహదారి నిర్మాణంలో గ్రామానికి చెందిన 28 ఎకరాల సాగుభూమి వెళ్తుందని చెప్పారు. పంట భూములు …
Read More »18 సంవత్సరాలు నిండినవారు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలి
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుదారులని, ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవాల్సిందిగా బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు.ఆదివారం రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని ఓటర్ ఐడి కార్డ్ ఆధార్ అనుసంధానం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరును నమోదు …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాము
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ఆదివారం గుర్తించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్‌లను నిర్మించి ఇవ్వడానికి …
Read More »సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచ్ వికార్ పాషా చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ 14 వేల విలువగల సీఎం సహాయనిధి చెక్కును లబ్ధిదారుడు గంగాధర్‌కు అందజేసినట్లు సర్పంచ్ అన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, …
Read More »ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
రెంజల్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో 73వ రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెంజల్, సాటాపూర్, తాడ్ బిలోలి, నీలా, దూపల్లి, బాగేపల్లి, కునేపల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం రచించి 73 యేళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగం గొప్ప తనాన్ని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు …
Read More »ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సస్పెన్షన్
రెంజల్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్ అరుణ్ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరిని డిస్‌చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే …
Read More »