renjal

మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనఊరు మన ఎమ్మెల్యే రెండవ దఫా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బొర్గం, తాడ్‌ బిలోలి, మౌలాలి తాండా గ్రామాలలో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా, బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు హజీ ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన …

Read More »

కల్లు దుకాణం తొలగించాలి

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గం గ్రామంలో జనావాసాలకు మధ్యలో నిర్వహిస్తున్న కల్లు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు మంగళవారం ఎక్సైజ్‌ ఎస్సై బాలయ్యకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సిద్ద సాయిలు, గైని కిరణ్‌, ఎంఎల్‌ రాజు, శివ తదితరులు ఉన్నారు.

Read More »

రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం

రెంజల్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిరానికి మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో లక్ష రూపాయల విరాళాన్ని గ్రామ సర్పంచ్‌ వికార్‌ పాషాకు అందజేశారు. ఇందుకుగాను గ్రామస్తుల తరపున బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిలకు సర్పంచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రామాలయం చైర్మన్‌ …

Read More »

ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ

రెంజల్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని మైనార్టీ స్మశాన వాటిక ప్రహరి గోడ నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ తెలిపారు. సిడిపి నిధుల ద్వారా ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్‌, …

Read More »

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

రెంజల్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని 17 గ్రామాలలో సామాజిక తనిఖీలు చేపట్టడం జరిగిందని డిఆర్డిఏ పిడి చందర్‌ నాయక్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదికను పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల కాలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 9 కోట్ల 30 లక్షల పనులు చేపట్టినట్లు పిడి వెల్లడిరచారు. సామాజిక తనిఖీ బృందం …

Read More »

భారత్‌ జోడోకు తరలిన నాయకులు

రెంజల్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ జావిధోద్దీన్‌, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్‌ రాములు, సాయరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ …

Read More »

రెంజల్‌లో బీఆర్‌ఎస్‌ సంబరాలు

రెంజల్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

రెంజల్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సత్యగౌడ్‌ గత వారం రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ఆర్టిసి మిత్ర బృందం తరఫున రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య మాదవి కి అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా …

Read More »

భారత్‌ జోడో యాత్రవిజయవంతం చేయండి

రెంజల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జూడో యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ జావిధోద్దీన్‌ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ భారీ …

Read More »

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖలకు సంబంధించిన విషయాలపై చర్చించి మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సభ్య సమావేశం ముగించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన ఎన్‌ఎస్‌ఎఫ్‌ భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ యోగేష్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. అవసర నిమిత్తం లబ్ధిదారులు తమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »