రెంజల్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం రెంజల్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.
Read More »ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ చౌరస్తా దగ్గర కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ …
Read More »ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్ నగర్, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రెంజల్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన లోక్ అదాలత్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ వెంకటరావు, ప్రముఖ వైద్యుడు జీవన్ రావుల సోదరుడు నర్సింగరావు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని, మౌలాలి తాండా సర్పంచ్ సునీత బాబునాయక్ తండ్రి మరణించడంతో వారి కుటుంబాన్ని శనివారం రాత్రి ఎమ్మెల్యే షకీల్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మనోధైర్యాన్ని నింపారు. ఆయన …
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని జెడ్పిటిసి విజయ, విండో చైర్మన్ మోహినోద్దిన్ అన్నారు. ఆదివారం వీరన్న గుట్ట గ్రామంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని …
Read More »పోలీసు అమరవీరుల సేవలు మరువలేని…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు …
Read More »ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య…
రెంజల్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం రెంజల్ గ్రామానికి చెందిన శ్రావన్ గౌడ్ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న …
Read More »ఘనంగా బోనాల పండుగ
రెంజల్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని రెంజల్, దూపల్లి, సాటా పూర్, బొర్గం, తాడ్ బిలోలి, కునేపల్లి, బాగేపల్లి, కళ్యాపూర్ గ్రామాలలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని గ్రామదేవతలకు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతియేటా గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలను సమర్పించడం ఆనవాయితీ. వేడుకలో సర్పంచ్‌లు రమేష్ కుమార్, …
Read More »కంటి వైద్య శిబిరానికి చక్కని స్పందన…
రెంజల్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి అధికసంఖ్యలో కంటి సమస్యలున్న వారు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. 130 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 38 మందికి మోతి బిందు ఆపరేషన్ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి …
Read More »స్థల వివాదాన్ని పరిష్కరించిన ఆర్డీవో
రెంజల్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా వివాదాస్పదమైన చత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు స్థల సమస్యను ఎట్టకేలకే బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ శుక్రవారం పరిష్కరించారు. ఆర్టీసీ అధికారులు, గ్రామస్తులకు గత నాలుగు నెలలుగా స్థల సమస్యతో అగాధం పెరిగిపోయింది. చివరికి ఆర్టీసీ అధికారులు గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. విషయాన్ని స్థానిక సర్పంచ్ మర్లషికారి …
Read More »