renjal

ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు

రెంజల్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బొర్గం, పేపర్‌ మిల్‌ గ్రామంలో శుక్రవారం బుద్ధ పౌర్ణమి 2567వ బుద్ధ జయంతి వేడుకలను మాలమహనాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలమహనాడు మండల యూత్‌ అధ్యక్షుడు సిద్ద సాయిలు,అబ్బోల్ల శ్రీకాంత్‌,కిషన్‌,రమేష్‌, చంద్రకాంత్‌, గౌతమ్‌ తదితరులు ఉన్నారు.

Read More »

అంబేద్కర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

రెంజల్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సర్పంచ్‌ అలిమా ఫారూఖ్‌ పటేల్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని పేపర్‌ మిల్‌ గ్రామంలో విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా నీలీ …

Read More »

తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించాలి

రెంజల్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దయి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని దూపల్లి, వీరన్న గుట్ట, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో తడిసి ముద్దయిన ధాన్యపురాసులు, మొలకెత్తిన …

Read More »

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

రెంజల్, మే 2 నిజామాబాదు న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లిడంతో భారీ ఎత్తున నష్టపోయారని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా పారిశుధ్య కార్మికులను సోమవారం స్థానిక సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల మషికారి రమేష్‌ కుమార్‌ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా …

Read More »

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలి

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి లను వెంటనే రెగ్యులర్‌ చేయాలని సిపిఐ ఎంఎల్‌ ప్రజాపంథా నాయకులు రాజేశ్వర్‌, నాగన్న అన్నారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సోమవారానికి మూడో రోజుకు చేరడంతో కళ్ళకు గంతలు కట్టుకొని …

Read More »

పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం

రెంజల్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హక్కులను సాధించాలంటే పోరాటాల ద్వారానే సాధ్యం అవుతాయని చికాగో కార్మికులు నిరూపించారని కార్మిక అమరుల స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాలను సాధించుకున్నామని సీపీఐఎంఎల్‌ ప్రజపంథా జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్‌, పెద్దులు అన్నారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో సోమవారం ప్రపంచ కార్మికుల దినం మేడేను పురస్కరించుకుని కార్మికుల జెండా ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సమసమాజం ఏర్పడాలంటే …

Read More »

దళితరత్న అవార్డు గ్రహీతగా సిద్ధ సాయిలు

రెంజల్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మాల మహానాడు మండల యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధ సాయిలు చేసిన సేవలను గుర్తించి అంబేద్కర్‌ జయంతోత్సవాలను పురస్కరించుకుని శనివారం నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ శేఖర్‌ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. గత దశాబ్ద కాలం నుండి మండలంలో దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను నిర్భయంగా ఎదుర్కొంటున్న …

Read More »

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు.గురువారం మండలంలోని దూపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం సర్పంచ్‌ సాయరెడ్డి మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్‌ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని …

Read More »

మహనీయుల జయంతోత్సవ సభ విజయవంతం చేయండి

రెంజల్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న బోధన్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే,భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రావ్‌ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్ట్‌ ల ఫోరమ్‌ బోధన్‌ డివిజన్‌ ఉపాధ్యక్షుడు బి.కిరణ్‌, మాలమహానాడు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు సిద్ద ప్రభాకర్‌, పిలుపునిచ్చారు.గురువారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »