కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …
Read More »జన్నెపల్లె పెద్ద వాగులో యువకుడి మృతి
నవీపేట్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నెపల్లె గ్రామ పెద్దవాగులో యువకుడి మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి… జన్నెపల్లె గ్రామానికి చెందిన అరే శ్రీధర్ (24) అనే యువకుడు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం జన్నెపల్లె పెద్ద వాగు సమీపంలో బట్టలు, సెల్ ఫోన్, చెప్పులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గజఈతగాళ్ళ …
Read More »ఖలీల్ అహ్మధ్ మరణం ఫుట్‌బాల్ లోకానికి తీరని లోటు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మధ్ మరణం నిజామాబాద్ ఫుట్‌బాల్ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఖలీల్ సంతాప సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు …
Read More »దొంగ అరెస్ట్, రిమాండ్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …
Read More »క్యారం విజేతలకు బహుమతుల ప్రదానం
భీమ్‌గల్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ సర్పంచ్, రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్, ఎన్‌ఎస్‌ఎఫ్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర రైతు విభాగం ఛైర్మన్‌గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం గత మూడురోజులుగా క్యారం టోర్ని నిర్వహించారు. భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్నీలో విజేతలుగా నిలిచిన ఉత్తమ క్రీడాకారులకు భీమ్‌గల్ మునిసిపల్ ప్రాంగణంలో బుధవారం ఛైర్‌పర్సన్ …
Read More »హోరాహోరీగా క్యారం క్రీడా పోటీలు
భీమ్‌గల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణ స్థాయి వేముల సురేందర్ రెడ్డి స్మారక క్యారం టోర్ని రెండవ రోజు ఆదివారం కూడా కొనసాగింది. హోరా హోరీగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. సింగిల్స్‌లో ఫ్రీ క్వాటర్ ఫైనల్లో జెజె శ్యామ్, ఫెరోజ్ పై విజయం సాధించారు. సింగిల్స్‌లో మొత్తం 40 మంది క్రీడాకారులు పోటీలో తలపడనున్నారని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం …
Read More »క్యారం టోర్ని ప్రారంభించిన భీమ్‌గల్ ఛైర్‌పర్సన్
భీమ్‌గల్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలో దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ భీమ్‌గల్ పట్టణస్థాయి క్యారం టోర్నిని భీమ్‌గల్ పట్టణ ఛైర్‌పర్సన్ మల్లెల రాజశ్రీ స్థానిక వార్డు కౌన్సిలర్‌లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యారం క్రీడకు భీమ్‌గల్ ప్రసిద్ధి అన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ గున్నాల బాల భగత్, కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, లత, ధరావత్ …
Read More »యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్ …
Read More »పివైఎల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు
డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్, షటిల్, సైక్లింగ్, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు …
Read More »22 నుండి వేముల సురేందర్‌రెడ్డి స్మారక క్యారం టోర్ని
భీమ్‌గల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలోని దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారక భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్ని నిర్వహిస్తున్నట్టు టోర్ని కన్వీనర్ మందుల హన్మాండ్లు, కో కన్వీనర్ కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడురోజుల పాటు టోర్ని నిర్వహించనున్నామని, ఈనెల 25న …
Read More »