కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ టైటిల్‌లో ఛాంపియన్‌గా నిఖత్ జరీన్
నిజామాబాద్, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్ తాజాగా మధ్యప్రదేశ్ బోపాల్‌లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్ (ఆర్‌ఎస్‌పిబి) బాక్సర్ …
Read More »ముగిసిన వాజ్ పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్
ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపును నిర్వహించారు. బోధన్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్, వడ్డేపల్లి సర్పంచ్ కూరెళ్ళ శ్రీధర్ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …
Read More »క్రీడా ప్రాంగణాలను 31 లోగా ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల …
Read More »క్రీడాకారులను అభినందించిన ప్రిన్సిపాల్
బాన్సువాడ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 17 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన డిగ్రీ కళాశాల జట్టును సోమవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాననికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 23న చెన్నైలోని అమితి యూనివర్సిటీలో జరిగే …
Read More »టియులో అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్
డిచ్‌పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్ (బాలికల) టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య రవీందర్ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ …
Read More »హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. పవన్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్ విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ హ్యాండ్‌బాల్ జిల్లా సీనియర్ మెన్ జట్టు సెలక్షన్స్ నిర్వహించారు. సెలక్షన్స్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిజామాబాద్ జిల్లా …
Read More »ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్
డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్ ఎంపీపీ యోగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …
Read More »జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్ లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్ రన్నింగ్ లో రజత మెడల్, 300 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్, 5 వ …
Read More »