నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుణి గుగులోత్ సౌమ్య యూరోప్ దేశమైన క్రొయేషియా దేశనికి చెందిన డైనమో జేగ్రేబ్ క్లబ్‌కు సెలెక్ట్ కావడం యావత్ భారతదేశానికి గర్వకారణం అని నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ అహ్మద్ తెలిపారు. అండర్ 14 నుండి సీనియర్ జట్టువరకు ఎన్నికై ఈ రోజు ఇతర దేశాల క్లబ్బుకు ఎన్నిక అవ్వడం చాలా గొప్పవిషయం అని …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ …
Read More »లక్ష్యాలు సాధించేవరకు విశ్రమించకూడదు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్ అండ్ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »ముగిసిన ఫ్రీడం కప్ క్రీడా పోటీలు
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం కప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిసాయి. గురువారం సాయంత్రం కలెక్టరేట్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్ వర్సెస్ పోలీస్ కమిషనర్ జట్ల మధ్య టగ్ ఆఫ్ వార్ రసవత్తరంగా సాగింది. కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు …
Read More »ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కళాభారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో కలిసి జిల్లా …
Read More »కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్ బిడ్డ హుస్సాముద్దీన్‌కు కాంస్య పతకం
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్ వెల్త్ క్రీడల్లో నిజామాబాద్‌కు చెందిన మరో బిడ్డ సుబేదార్ హుస్సాముద్దీన్ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారుల పుట్టినిల్లు నిజామాబాద్ గడ్డ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా, తెలంగాణ కీర్తిని …
Read More »నిజామాబాద్ బిడ్డ గెలుపు యావత్ దేశానికి గర్వ కారణం
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్ వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్, నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన పగిలిస్ట్‌ను …
Read More »హోరా హోరీగా జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా చెస్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా ముగిసిందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సుభాష్ నగర్ నెహ్రూ యువ కేంద్రలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ చేతుల మీదుగా ప్రారంభమైన పోటీలు, సాయంత్రం 5గంటలకు ముగిసాయి. జూనియర్, …
Read More »25న చెస్ టోర్నీ
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతీయువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, మనోవికాసానికి దోహదపడే చెస్ క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ జిల్లా స్థాయిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించిందని నిజామాబాద్ జిల్లా యువజన అధికారిని, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ రెండు విభాగాలుగా నిర్వహించబడుతాయని, 15 సంవత్సరాల నుండి 21 …
Read More »