cultural

ఉగాది పచ్చడి వితరణ

బాన్సువాడ, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్స్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సచిన్‌ మాట్లాడుతూ ఫౌండేషన్‌ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉగాది పండుగ రోజున గత ఆరు సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని ప్రజలకు వితరణ చేయడం …

Read More »

కామారెడ్డిలో పంచాంగ శ్రవణం

కామారెడ్డి, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సరమును పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా టీఎన్జీవోస్‌, టీజీవో సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌ నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో వేద పండితులు ఆంజనేయ శర్మ, వారి …

Read More »

జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి …

Read More »

ఏప్రిల్‌ 12న వీర హనుమాన్‌ విజయయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వహిందూ పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్‌ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్‌ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర …

Read More »

తపస్‌ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

బాన్సువాడ, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో తపస్‌ శాఖ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేయాలని, రసాయనాలు కలిగిన రంగులను కాకుండా ప్రకృతి సహజసిద్ధమైన రంగులను వాడు ఎందుకు …

Read More »

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

Read More »

ఘనంగా రామారావు మహారాజ్‌ విగ్రహ వార్షికోత్సవం

బాన్సువాడ, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని సాయి కృపా నగర్‌ కాలనీలో గల రామారావు మహారాజ్‌ విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఆల్‌ ఇండియా బంజారా శక్తి పీట్‌ ప్రధాన కార్యదర్శి బాధ్య నాయక్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ, సేవాలాల్‌ రామారావు మహారాజ్‌ ల భోగ్‌ బండార్‌, ప్రత్యేక పూజలు …

Read More »

క్షత్రియ పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షత్రియ పాఠశాల చేపూర్‌ నందు ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహింపబడిన కార్యక్రమంలో శివాజీ చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ శివాజి గొప్ప చక్రవర్తియే గాకుండా హిందూ ధర్మ పరిరక్షకుడని అన్నారు. గొరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడని, మొఘల్‌ సామ్రాజ్యాధిపతులకు …

Read More »

ఘనంగా రథోత్సవం, నేడు పూర్ణాహుతి

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ,పంచామృత అభిషేకము, సర్వ దేవత పూజా,హోమం, ప్రాత: బలిహారణం మధ్యాహ్నం 1 గంటకు రథప్రతిష్ట, రథహోమం, రథ బలి, పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామి వారికి అర్చకులు విశేష పూజలు జరిపి రథభ్రమణం జరిపించారు. తరువాత సాయం …

Read More »

శ్రీ ఆనందగిరి లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం కొలిప్యాక్‌ గ్రామంలోని మధ్వ రాయల పుణ్యక్షేత్రం అయిన శ్రీ ఆనందరిగి లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ఆదివారం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు దండాల మోహన్‌ శర్మ ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గ్రామాలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »