ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే. ఆయన ప్రత్యేక …
Read More »వేములవాడ వెళ్లే భక్తులకు శుభవార్త
వేములవాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణకాశీగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ కోనేటిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే గత కరోనా కాలం నుండి ధర్మగుండం (కోనేరు)లో నీరు నింపకుండా, భక్తులకు అనుమతించడం లేదు. కాగా ఆదివారం, డిసెంబరు 4వ తేదీ ఉదయం 8 గంటలకు రాజన్న ఆలయ ధర్మ గుండం పున: ప్రారంభం …
Read More »ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …
Read More »ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్ ప్రొఫెసర్, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని …
Read More »శివనామస్మరణతో మారుమోగిన ‘‘సిద్ధుల గుట్ట’’
ఆర్మూర్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్తీక మాసం చివరి రోజైన మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు సిద్ధులగుట్టపైకి చేరుకొని మహాదేవుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ (సప్తాహారతి) వైభవోపేతంగా జరిగింది. సిద్ధులగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయించారు. జీవన్ రెడ్డి …
Read More »యువత నిజమైన చరిత్ర తెలుసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల యువ సమ్మేళనం స్థానిక రాజారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా అఖిలభారత ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలె శ్యామ్ కుమార్ విచ్చేసి మాట్లాడారు. నిజాం దౌర్జన్యాలను, రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజానీకం అనుభవించిన కష్టాలను కన్నులకు కట్టినట్లుగా వివరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకి …
Read More »ఘనంగా ముగిసిన వీరభద్ర ఉత్సవాలు
నిజాంసాగర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగా ఈ యేడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వీరభద్ర స్వామి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల నుండి కొనసాగిన మహోత్సవాలు మొదటి రోజు పసుపు పెట్టు కార్యక్రమం, పందిరి వేసుట, రెండవ రోజు భద్రకాళి సమేత వీరభద్ర కళ్యాణం అనంతరం అన్నదానం భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. …
Read More »కాల భైరవస్వామిని దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే
కామారెడ్డి, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లోని కాల బైరవ స్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యే సురేందర్ పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో అగ్గి గుండాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ లావణ్య మల్లేశ్ ఇంటికి చేరుకుని గ్రామ సర్పంచ్‌కి, వారి పాలక వర్గానికి …
Read More »జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలు వీరే
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక దయానంద యోగా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో యువతుల విభాగంలో ప్రథమ నమ్రత, ద్వితీయ స్వరజ్ఞ, తృతీయగా శ్రీనిధి, యువకుల విభాగంలో ప్రథమ భూమేష్, ద్వితీయ రాజు, తృతీయగా శివ నిలిచారని జిల్లా యువజన అధికారిణి శైలి …
Read More »తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబం బతుకమ్మ
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్ సిబ్బంది, పిఆర్‌టియు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ …
Read More »