నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్న ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో …
Read More »ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ శివారులోని పాండు తర్ప వద్ద ప్రజాపయోగ అవసరాల నిమిత్తం ఇదివరకు ప్రభుత్వం సేకరించిన భూములను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ భూములకు సంబంధించిన వివరాల గురించి బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 67 ఎకరాల భూమిని ప్రభుత్వపరంగా సేకరించడం జరిగిందని తెలిపారు. రెండు పడక గదుల …
Read More »పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ …
Read More »సిఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగస్తుల చిరకాల కల నెరవేరిందని, 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న …
Read More »సిరి ధాన్యాల ఆవశ్యకత పై విస్తృత ప్రచారం నిర్వహించాలి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోషక లోపాలను నివారిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సిరి ధాన్యాల వినియోగం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇందులో …
Read More »ప్రతీ వారం క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి
నిజామాబాద్, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో …
Read More »ప్రభుత్వ సుపరిపాలనతోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతోంది రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా …
Read More »రిజర్వాయర్ పనులను పరిశీలించిన స్పీకర్
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి …
Read More »విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »పెన్షనర్ల వినూత్న ధర్నా
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా పెండిరగ్లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు గోడుగులతో ధర్నా నిర్వహించారు. ప్రధానంగా పి.అర్. సి. కాల పరిమితి ముగిసినందున జూన్ 2023 నుండి అమలయ్యే విధంగా కొత్త పిఆర్సి కమిటీ …
Read More »