nizamabad

దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర మరువలేనిది

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …

Read More »

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ …

Read More »

రైతు మోసకారి ప్రభుత్వం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ …

Read More »

వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ బిట్వీన్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది. అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్‌ లీకేజీ, పేలుడు ఇతర …

Read More »

పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని చిన్నాపూర్‌ వద్ద గల అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి ఫారెస్ట్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. చిల్డ్రన్స్‌ పార్క్‌ పనులను …

Read More »

6వ ఎలైట్‌ ఉమెన్స్‌ నేషనల్‌ టైటిల్‌లో ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న నిజామాబాద్‌ బిడ్డ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తాజాగా మధ్యప్రదేశ్‌ బోపాల్‌లో జరిగిన 6వ జాతీయ ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్‌ (ఆర్‌ఎస్‌పిబి) బాక్సర్‌ …

Read More »

వినియోగదారులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులు తమ హక్కుల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ చైర్‌ పర్సన్‌ సువర్ణ జయశ్రీ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. …

Read More »

నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలు తప్పక సాధించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తూ ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనలో అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన …

Read More »

కల్లాలు కట్టొద్దంటే గల్లాలు పట్టి నిలదీస్తాం

నిజామాబాద్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తమ పంటలను ఆరబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కల్లాలు కట్టొద్దంటే రైతుల పక్షాన బీజేపీ నాయకుల గల్లాలు పట్టి నిలదీస్తామని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతు కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, …

Read More »

సివిల్‌ సప్లై కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

నిజామాబాద్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో సమ్మె చేస్తున్న సివిల్‌ సప్లై కార్మికుల సమ్మె శిబిరాన్ని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సివిల్‌ సప్లై కార్పోరేషన్‌లో పనిచేస్తున్న హమాలీ స్వీపర్‌ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. గత సంవత్సర క్రితం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »