nizamabad

ఘనంగా కాళోజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా గాజుల్‌ పెట్‌లోని కాళోజీ విగ్రహానికి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తన కవిత్వాల ద్వారా ప్రజలలో ఏర్పాటు ఆవశ్యకతను చేరవేసి మన …

Read More »

గిరిరాజ్‌ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి. రామ్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్‌ …

Read More »

బ్యాంకర్ల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన …

Read More »

బస్సు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్‌ హైదరాబాద్‌ నుండి నిజామాబాద్‌ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్‌, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుండి బోధన్‌ డిపో సూపర్‌ లగ్జరీ …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 16 నుండి మూడు రోజుల పాటు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజుతో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వజ్రోత్సవ వేడుకలు, వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై …

Read More »

పండుగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు చేపట్టనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అట్టహాసపు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌ …

Read More »

బిజెపి నేతలు లాజిక్‌ మరిచిపోయారు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్‌ నిజామాబాద్‌ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల …

Read More »

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులందరికీ చేతినిండా పని లేదని, నెలలో 10 లేక 12 రోజులు పని మాత్రమే లభిస్తుందని, ఈ పరిస్థితులలో 2014 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల్లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని హామీ …

Read More »

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్‌ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాలతో కలిసి కలెక్టర్‌ బుధవారం వినాయక శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, అక్కడి నుండి మొదలుకుని గుర్బాబాదీ రోడ్‌, లలితమహల్‌ థియేటర్‌, గంజ్‌, గాంధీచౌక్‌, పవన్‌ థియేటర్‌, …

Read More »

లాఠీ చార్జికీ నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమష్యలు, నిరుద్యోగుల సమష్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాన్వాయ్‌ని అడ్డగించిన పిడిఎస్‌యు నాయకులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గిరిరాజ్‌ కళాశాలలో దగ్దం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పి.డి.ఎస్‌.యు. జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడారు. ఈరోజు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో విద్యా రంగంపై చర్చించి, సమస్యల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »