nizamabad

ప్రగతి భవన్లో గురుపూజోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ తదితరులు …

Read More »

ఇందూరుకు కళాభారతి ఆడిటోరియం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందామని ముఖ్యమంత్రి బహిరంగ సభలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని, ఉమ్మడి జిల్లాలోని మిగితా 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్‌ కు అదనంగా 10 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …

Read More »

ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా న్యూ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌) ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్‌ నుండి హెలికాప్టర్‌ ద్వారా సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్‌ వద్ద స్పీకర్‌ …

Read More »

గురువులు సమాజ దిశా నిర్దేశకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువులు సమాజ దిశా నిర్దేశకులని, అందుకే సమాజంలో గురువులకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్‌ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా …

Read More »

జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్‌ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ …

Read More »

కేసిఆర్‌కు బహిరంగలేఖ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 5వ తేదీన నిజాంబాద్‌ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ నగర ప్రజల తరఫున సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఎంకి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నూతన కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌, …

Read More »

క్రొయేషియా క్లబ్బుకు ఎన్నికైన గుగులోత్‌ సౌమ్య

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ ఫుట్బాల్‌ క్రీడాకారుణి గుగులోత్‌ సౌమ్య యూరోప్‌ దేశమైన క్రొయేషియా దేశనికి చెందిన డైనమో జేగ్రేబ్‌ క్లబ్‌కు సెలెక్ట్‌ కావడం యావత్‌ భారతదేశానికి గర్వకారణం అని నిజామాబాద్‌ ఫుట్బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షకీల్‌ అహ్మద్‌ తెలిపారు. అండర్‌ 14 నుండి సీనియర్‌ జట్టువరకు ఎన్నికై ఈ రోజు ఇతర దేశాల క్లబ్బుకు ఎన్నిక అవ్వడం చాలా గొప్పవిషయం అని …

Read More »

తుది దశ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇంకనూ అక్కడక్కడా మిగిలిపోయి ఉన్న తుదిదశ పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో …

Read More »

నిరుద్యోగ అభ్యర్థులకు సదవకాశం ‍‍- ‍‍నేడు జాబ్‌మేళా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌లోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ఉంటుందని కళాశాల ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపనీ ఇండియా లిమిటెడ్‌ వారు నిర్వహిస్తున్న మేళాలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు ఉద్యోగావకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బోధన్‌, మెట్‌పల్లి …

Read More »

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రాధామ్యాలకు సంబంధించిన పనులను చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గల రైతు వేదికలలో సివిల్‌ పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు దాటిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »