nizamabad

అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు

నిజామాబాద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మున్సిపల్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రవేశపెట్టిన టీఎస్‌-బీపాస్‌ యాక్టును పూర్తి స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ టీఎస్‌-బీపాస్‌ యాక్టు, పట్టణ ప్రగతి, హరితహారం తదితర …

Read More »

కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ 3వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష …

Read More »

బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సొంత పార్టీ వారు ఎంఎల్‌సి కవితపై నిరాధార నిందలు మోపగానే హైదరాబాద్‌ బిజెపి కార్యకర్తలు ఎంఎల్‌సి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ సంఘటనను బిసి కులాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని బిసి కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సహజమే …

Read More »

చదువుతూనే ఉద్యోగం – గొప్ప అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ బీ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరం అని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం …

Read More »

పంటల సాగు వివరాలను పక్కాగా సేకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురువారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఇటీవల దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పలుచోట్ల దెబ్బతిన్న పంటల స్థానంలో కొందరు రైతులు తిరిగి …

Read More »

ఈపీఎస్‌ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రముఖ ప్రైవేట్‌ కార్మిక కేంద్రాలలో పనిచేసి రిటైర్‌ అయిన ఈపీఎస్‌ పెన్షనర్లకు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 9000 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నిజాంబాద్‌లోని రీజనల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి …

Read More »

జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్‌, తక్షణమే …

Read More »

న్యూ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డుకు ఆనుకుని నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలతో కూడిన కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. సెప్టెంబర్‌ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు న్యూ కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కలెక్టర్‌ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలన జరిపారు. విశాలమైన ప్రాంగణంతో కూడిన కలెక్టరేట్‌ …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు సువర్ణ అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి, ఎంఇసి మాథ్స్‌ సబ్జెక్ట్‌ తో కనీసం 60 శాతం సగటు మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్‌ 2021 ` 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాఫ్ట్‌ వేర్‌ రంగంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయించామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో పాటు డీపీఓ జయసుధకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »