nizamabad

అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రధాన జలాశయాలకు చెందిన మెయిన్‌ కెనాళ్లతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు ఇరువైపులా ఆక్రమణలను తొలగిస్తూ, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అడ్డుపడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇరిగేషన్‌, ఉపాధి హామీ, …

Read More »

ఒలింపిక్‌ డే రన్‌ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్‌ డే రన్‌ ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రారంభించారు. స్థానిక రాజరాజేంద్ర థియేటర్‌ చౌరస్తా నుండి చేపట్టిన ఒలింపిక్‌ పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్‌, తాను కూడా క్రీడా జ్యోతిని చేతబూని ఒలింపిక్‌ రన్‌లో భాగస్వాములయ్యారు. బడాబజార్‌, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, బస్టాండ్‌ మీదుగా ఒలింపిక్‌ …

Read More »

ఫలించిన చర్చలు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ సాటర్స్‌, ట్రై పిల్లర్‌, క్లర్క్స్‌ మొదలగు కేటగిరీలకు చెందిన బీడీ కార్మికుల వేతన ఒప్పందం 30.04.2022న ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మంగళవారం 21.06.2022న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గుజరాతి …

Read More »

ప్రసవాలు జరుగని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది జీతాలు నిలుపుదల చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం లేకపోయినా సిజీరియన్‌ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లలో నూటికి నూరు శాతం సీజీరియన్‌ కాన్పులే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో …

Read More »

చిన్నాపూర్‌ పార్కును సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులో గల చిన్నాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, సోలార్‌ ద్వారా నడిచే బోరుబావులు, రోడ్డు …

Read More »

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు యోగాను తమ జీవితంలో భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, ఆరోగ్య రక్ష, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, ఆయుష్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, జిల్లా యువజన, క్రీడలు, ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్‌ జిల్లా …

Read More »

భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్రీయ భూగర్భ జలబోర్డు అధికారులు జిల్లాలో భూగర్భ జలాల స్థితిగతుల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. వ్యవసాయ …

Read More »

తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌, వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

పల్లె ప్రగతి స్పూర్తితో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని అధికారులందరూ పక్షం రోజులపాటు తీవ్రంగా శ్రమిస్తూ, సమిష్టి కృషితో మంచి ఫలితాలు సాధించగలిగారని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అంకిత భావంతో …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలనువిన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »