నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశలో ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే, జీవితమంతా సుఖసంతోషాలతో గడపవచ్చని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. విద్య అనే ఆయుధాన్ని అనుకూలంగా మల్చుకుంటే, ఉన్నత స్థానంలో స్థిరపడి కుటుంబ తలరాతను మార్చుకోవచ్చని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్ధులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల బీసీ హాస్టల్‌లో ప్రేరణ కార్యక్రమం …
Read More »టీఎన్ జీఓల సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సంఘ భవనంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై, మైనార్టీ సోదరులు, ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. …
Read More »ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ జిల్లా వైద్య అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. గర్భిణీ స్త్రీల నమోదు, గర్భిణీ స్త్రీలలో …
Read More »ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పెద్ద ఎత్తున 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు వేయి మంది …
Read More »ప్రజావాణి ప్రాధాన్యతను అధికారులు గుర్తెరగాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. మొత్తం 75 అర్జీలు రాగా, వాటిని పరిష్కరించాల్సిందిగా సూచిస్తూ …
Read More »నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు విధుల రొటేషన్ అమలు చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్లకు రొటేషన్ పద్ధతిలో విధుల మినహాయింపు ఇవ్వాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ఈరోజు నుండి అన్ని పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు పదవతరగతి మినహా …
Read More »25న మలేరియా అవగాహన ర్యాలీ
నిజామాబాద్, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన జిల్లా కేంద్రంలో మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు పిఓడిటిటి కార్యాలయం నుండి డిఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.
Read More »ఎస్‌ఎస్‌సి పరీక్షల ఏర్పాట్లపై 25న సమావేశం
నిజామాబాద్, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్ల విషయమై చర్చించేందుకు ఈ నెల 25వ తేదీన కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఆయా శాఖల జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌వీ. దుర్గాప్రసాద్ తెలిపారు. ఎస్‌ఎస్‌సి వార్షిక పరీక్షలను సాఫీగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో సూచనలు చేయడం …
Read More »టియు విద్యార్థులకు ఐటి హబ్‌లో మెరుగైన అవకాశాలు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ఐటి హబ్ ఏర్పాటు చేస్తుండడంతో అర్బన్ ఎమెల్యే గణేష్ బిగాల, సోదరులు మహేష్ బిగాల నేతృత్వంలో శుక్రవారం వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరయ్యారు. అమెరికాకు చెందిన వైటల్ గ్లోబల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నిజామాబాద్‌లో ఐటి …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
రెంజల్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం దండిగుట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాగా ఆరబెట్టి శుభ్రపరిచిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి పూర్తిస్థాయి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. కాగా, ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం …
Read More »