nizamabad

అవసరం లేకున్నా సిజీరియన్‌ చేశారనే ఫిర్యాదులు రాకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ కాన్పు అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ కావాలనే సీజీరియన్‌ ఆపరేషన్‌ చేశారని తరుచూ తమకు ఫిర్యాదులు వస్తుంటాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నార్మల్‌ డెలివరీలు చేసేందుకు వైద్యులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సిజీరియన్‌ ఆపరేషన్‌ వద్దు – సాధారణ కాన్పు …

Read More »

నామ్‌ కే వాస్తేగా పనిచేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇప్పటికే పక్షం రోజులు జాప్యం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల నుండి వరి ధాన్యం సేకరించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »

అంబేడ్కర్‌ అందరివాడు…జాతీయ నాయకుడు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఏ ఒక్క కులానికో, వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని, దేశ ప్రజలందరికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన జాతీయ నాయకుడని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులను ఒకే గొడుగు కిందకు తెస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేలా అంబేడ్కర్‌ …

Read More »

అంబేద్కర్‌, జార్జిరెడ్డిలకు విప్లవ నివాళులర్పించిన సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయులు భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 131వ జయంతి, ఉస్మానియా అరుణతార కామ్రేడ్‌ జార్జిరెడ్డి 50 వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో విప్లవ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడారు. దేశంలోని పీడిత ప్రజల పక్షపాతిగా, మనుధర్మ …

Read More »

మహా యజ్ఞంలా ధాన్యం సేకరణ జరపాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం సేకరణ బాధ్యతను మహా యజ్ఞంలా భావిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలోనూ రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని హితవు పలికారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో …

Read More »

ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమల తరహాలోనే వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. రైతులు మూస ధోరణిని వీడి, అభివృద్ధి చెందిన సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా ఆదర్శ రైతులు, రైతు …

Read More »

మన ఊరు-మన బడి పనులను వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటికే అనుమతి తెలిపిన పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో నోడల్‌ అధికారులు, ఆయా శాఖలకు చెందిన ఏఈలు, డీఈలు, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌ …

Read More »

జిల్లా ఆసుపత్రిని సందర్శించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మంగళవారం జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి, మందుల స్టాక్‌ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »

బీడీ కార్మికుల వేతనాలు చెల్లించాలి…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 15 రోజులుగా బీడీ కార్మికులకు పని లేకుండా చేసిన కిషన్‌ లాల్‌ రామ్‌ స్వరూప్‌ బీడీ ఫ్యాక్టరీ ముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి మేనేజర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ కార్మికులకు కార్మిక …

Read More »

బీసీ స్టడీ సర్కిల్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లో గల బిసి స్టడీ సర్కిల్‌ సెంటర్‌ను మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. ఆయా గదులను తిరుగుతూ స్థానికంగా అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కేంద్రంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్‌ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న బీసీ అభ్యర్థులకు ముందస్తు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »