nizamabad

జీవో నెం. 60 వెంటనే అమలు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) …

Read More »

రౌడీ షీటర్లపై నిరంతర నిఘా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణపతి, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌ లోని రౌడీ షీటర్లకు పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, రౌడీ షీటర్ల ప్రతి కదలికపై పొలీస్‌ వారి నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.

Read More »

గణేష్‌ విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ ధరఖాన్తు చేనుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి విగ్రహాల స్థాపనతో ప్రారంభమై 20న తుది నిమజ్జన శోభాయాత్ర ఊరేగింవుతో ముగుస్తుందని, శోభాయాత్ర సమయంలో ప్రజాక్షేమాన్ని, శాంతి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ గణేష్‌ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్‌ మండప నిర్వాహకులందరు తమ …

Read More »

గిరిజనుల భూములు లాక్కోవడమేనా హరితహారం…?

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌ జిల్లా, బీంగల్‌ మండలంలోని గంగరాయి, కారేపల్లి తండాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఆదివారం కోటగల్లీలో నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫ్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను, గిరిజనేతరులను భూమి నుండి …

Read More »

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ స్పూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం …

Read More »

జితేష్‌ పాటిల్‌కు ఘనంగా వీడ్కోలు, సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ని జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి హాజరై కామారెడ్డి కలెక్టర్‌ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో మున్సిపల్‌ కమిషనర్‌గా చాలా సేవలందించి …

Read More »

జాతీయ ప్రయోజనాల కోసమే లోక్‌ అదాలాత్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ప్రయోజనాల కోసమే జాతీయ లోక్‌ అదాలాత్‌ నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. 11 వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ విధి, విధానాలను తెలియజేస్తు సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన భౌతిక, వర్చుల్‌ సమావేశాల్లో ఆయన న్యాయాధికారులను ఉద్దేశించి …

Read More »

విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి మండల …

Read More »

స్కాలర్‌షిప్‌ ప్రక్రియ వెంటనే పూర్తి చేయండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో విద్యార్థుల పెండిరగ్‌ స్కాలర్‌ షిప్లపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 2017-18 నుండి 2020-21 వరకు నాలుగు …

Read More »

విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తెరిగి పాఠ్యాంశాలు బోధించాలని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కోటగల్లీలోని శంకర్‌ భవన్‌ పాఠశాలలో సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఉపాధ్యాయులతో ప్లాన్‌-ఎ (గత తరగతిలో ముఖ్యమైన అంశాలు) ప్లాన్‌-బి (ప్రస్తుత తరగతిలో అంశాలు) తయారు చేసుకోవాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »