nizamabad

గ్రీన్‌ ఛాలెంజ్‌కు మొక్కలు నాటిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ చాలెంజ్‌కు సమాధానంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్లీన్‌ గా గ్రీన్‌ గా ఉండాలనే దాంట్లో భాగంగా గ్రీనరీ పెంచే క్రమంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ చాలా ఉపయోగ పడుతున్నదని తాను ముగ్గురిని నామినేట్‌ చేశానని మహబూబ్‌ నగర్‌, మెదక్‌, …

Read More »

ఫీజుల దోపిడీ నియంత్రించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు …

Read More »

అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్కూల్స్‌, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం …

Read More »

విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్‌ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లా అధికారులు ప్రజావాణికి తప్పనిసరి హాజరు కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్‌ వ్యాధుల ప్రత్యేక డ్రైవ్‌ పూర్తి సమాచారం అందించేలా ఉండాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ …

Read More »

15 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ టాబ్లెట్స్‌ వేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్‌ టాబ్లెట్స్‌ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేషనల్‌ డి వార్మింగ్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 25 నుండి 31 వరకు నిర్వహిస్తున్నందున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో …

Read More »

అవార్డు గ్రహీతను అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగస్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని బోధన్‌ మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన రవితేజ బలపాలపై 3 గంటల 43 నిమిషాలలో జాతీయ గీతం చెక్కినందుకుగాను ఐదవ రికార్డు హోల్డర్‌గా ఎంపిక అయ్యి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ నుండి మెడల్‌, సర్టిఫికెట్‌, ఐడి కార్డ్‌, బ్యాడ్జి పొందారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని కలిసి వాటిని చూపించి వివరాలు …

Read More »

కోర్టు కేసులపై సత్వర స్పందన ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా శాఖలకు సంబంధించి కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు హాజరు కావడానికి ప్రతి ఆఫీసులో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసుకొని ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో కోర్టు కేసులు, ఉపకార వేతనాలు హరితహారంపై సమీక్ష సమావేశం …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం మోపాల్‌ మండలం కంజర్‌ గ్రామ పంచాయతీ భవనంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖ నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంపును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మెడికల్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూ అవసరమైన …

Read More »

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిన మహనీయుడు రాజీవ్‌ గాంధీ

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌, రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి జగడం సుమన్‌, నిజామాబాద్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ రాజీవ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »