nizamabad

ఎస్సీ కాలనీని సందర్శించిన ఏకసభ్య కమిషన్‌

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ గురువారం సాయంత్రం ముప్కాల్‌ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీని సందర్శించారు. స్థానికులను కలిసి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర రంగాలలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, …

Read More »

నూతన సంవత్సరంలో జిల్లాను ముందంజలో నిలుపుదాం

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌ లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని కలిసి …

Read More »

రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం తన చాంబర్‌ లో ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా చర్యలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని …

Read More »

ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్‌ బహిరంగ విచారణ

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్డ్‌ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తో కూడిన ఏక సభ్య కమిషన్‌ గురువారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్‌)లో బహిరంగ విచారణ నిర్వహించారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన షెడ్యూల్డ్‌ కులాల ప్రజాప్రతినిధులు, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, …

Read More »

కాలంతో కలిసి నడుద్దామ్‌…

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూతకాలాన్ని, వర్తమాన కాలంతో సరిచూసుకుని భవిష్యత్‌ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్‌ రావు, కార్యదర్శి సురేష్‌ దొన్పాల్‌, కోశాధికారి దీపక్‌ లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసిన సందర్భంలో …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జనవరి 2, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 2.18 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 12.45 వరకుయోగం : హర్షణం సాయంత్రం 4.54 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.49 వరకుతదుపరి గరజి రాత్రి 2.18 వరకు వర్జ్యం : ఉదయం 6.38 వరకుమరల తెల్లవారుజామున 4.38 – 6.10దుర్ముహూర్తము …

Read More »

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో మోపాల్‌ మండల కేంద్రంలో గల బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ కిరణ్‌, …

Read More »

2న ఏకసభ్య కమిషన్‌ రాక

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్‌ ఈ నెల 2న (గురువారం) ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌), నిజామాబాద్‌ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జనవరి 1, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : విదియ తెల్లవారుజామున 3.20 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.07 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.47 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.38 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.20 వరకు వర్జ్యం : ఉదయం 9.05 – 10.41మరల తెల్లవారుజామున 5.03 నుండిదుర్ముహూర్తము …

Read More »

2024 సంవత్సరం హెచ్చరించి వెళ్లింది…

1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »