నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్ – 2023 (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 న టెట్ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో …
Read More »17వ రోజుకు చేరిన ఏఎన్‌ఎంల సమ్మె
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, సెప్టెంబరు 1,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : విదియ తెల్లవారుజాము 3.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 6.48 వరకుయోగం : ధృతి సాయంత్రం 5.40 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.30 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 3.21 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.49 – 5.20దుర్ముహూర్తము : …
Read More »మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఆగష్టు 31, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి ఉదయం 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 5.39వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.22 వరకుయోగం : సుకర్మ రాత్రి 8.39 వరకుకరణం : బవ ఉదయం 8.03 వరకు తదుపరి బాలువ రాత్రి 6.50 వరకు ఆ …
Read More »తెలంగాణ విద్యార్థి పరిషత్ అధ్వర్యంలో రక్షాబంధన్
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా విద్యార్ధి పరిషత్ నిజామాబాద్ నగర అధ్యక్షుడు అఖిల్ అధ్వర్యంలో నగరంలోని సత్య ఒకేషనల్ కళాశాలలో రాఖీ పండగ పురస్కరించుకొని విద్యార్థినీలతో తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు రాఖీ కట్టించుకొని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా నగర అధ్యక్షుడు అఖిల్ మాట్లాడుతూ విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల రక్షణకోసం తెలంగాణ …
Read More »నోటిఫికేషన్ వద్దు – రెగ్యులరేషన్ ముద్దు
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ బుధవారం పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి వారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని రెగ్యులర్ చెయ్యాలని, ఎగ్జామ్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని …
Read More »అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ …
Read More »ఈ.డబ్ల్యు.ఎఫ్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ.డబ్ల్యు.ఎఫ్ రుణం కావాల్సిన నాన్ గెజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ దరఖాస్తులను డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించాలని జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉప సంచాలకులు బి.కోటేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. సంబంధిత ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. రుణాలు పొందగోరే జిల్లాలోని నాన్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.32 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 10.02 వరకుయోగం : అతిగండ రాత్రి 11.43 వరకుకరణం : వణిజ ఉదయం 10.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.17 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం …
Read More »