District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నిజామాబాద్‌ యూనిట్‌ యొక్క కాలమానిని డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల యొక్క శ్రేయస్సు కొరకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ కుమార్‌, జనరల్‌ సెక్రెటరీ మహేందర్‌ రెడ్డి, ట్రెజరర్‌ నాగేష్‌ రెడ్డి, సహాయ …

Read More »

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ లతో పాటు జానకంపేట్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మల్కాపూర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్లను సస్పెండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ హరితహారం, మన …

Read More »

ఆప్యాయంగా పలకరిస్తు ఆరోగ్య సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మండల కేంద్రమైన నవీపేట్‌ తో పాటు అదే మండలంలోని అభంగపట్నంలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి ఆరోగ్య సమస్యల గురించి …

Read More »

’కంటి వెలుగు’ మానవత్వంతో కూడిన కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో గల స్త్రీ స్వశక్తి భవన్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ హౌసింగ్‌ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ …

Read More »

నిజామాబాద్‌లో కల్తీ కల్లును అరికట్టాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో కల్తీ కళ్ళు అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ నగరంలో డైజోఫామ్‌ క్లోరోఫామ్‌ ఆల్ఫాజామ్‌ మొదలగు వాటిని కలిపి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తూ తాగుబోతులుగ మారుస్తున్నారని, వేలాది లీటర్ల కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం …

Read More »

కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్‌ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …

Read More »

ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …

Read More »

పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలి

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి రిటైర్‌ అయిన పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాబోయే బడ్జెట్‌ సమావేశంలో ఆ మేరకు మినహాయింపు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు …

Read More »

కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »