District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, బాలలందరూ అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలోని మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్మన్‌ …

Read More »

అవయవ దానం చేసి పలువురు జీవితాలకు వెలుగులు నింపారు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు అందే సాయిలు సతీమణి సుధారాణి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మంగళవారం మరణించారు. ఈమె నిజామాబాద్‌ కోర్టులో టైపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమె ఐదు ఆర్గాన్స్‌ గుండె, కాలేయం, కిడ్నీ, కండ్లు తదితర అవయవాలను దానం చేశారు. ఆమె చనిపోయి 8 మంది జీవితాలలో వెలుగులు …

Read More »

28న ఛలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్‌ అన్నారు. ఈ మేరకు శ్రామిక భవన్‌, కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లల్లో సుమారు 54వేల మందికి పైగా మధ్యాహ్న …

Read More »

ఫీజుల పెంపు జీవో 37 ఉపసంహరించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్‌ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు నవీన్‌, వంశీ డిమాండ్‌ చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో …

Read More »

ఘనంగా దీపావళి పండుగ

ఎడపల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం దీపావళి పండుగను ఘనంగా ప్రజలు జరుపుకున్నారు. నరకచతుర్ధశి సంధర్భంగా జరుపుకునే దీపావళి పండుగతో తమ ఇండ్లల్లో, తమ జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. నూతన అల్లుడ్లను అత్తగారింటికి పిలిచి దీపావళి కానుకలను సమర్పించుకున్నారు. అనంతరం …

Read More »

రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్‌ లతో కలెక్టర్‌ మంగళవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …

Read More »

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి …

Read More »

పెంచిన ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజులు తగ్గించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …

Read More »

అనుమతులు లేని బాణాసంచా దుకాణాలు సీజ్‌ చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్‌ శనివారం రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, ఫైర్‌ తదితర శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ …

Read More »

ఏడుగురు ఏ.ఈలకు మెమోలు జారీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పనుల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »