నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ జెడ్పి సీఈఓ గోవింద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ ప్రజల నుండి మొత్తం …
Read More »వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి అవసరం
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని జడ్పి చైర్మన్ దాదాన్నగారి విట్ఠల్ రావు అభిప్రాయపడ్డారు. నగరంలోని న్యూ అంబెడ్కర్ భవన్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మీ …
Read More »మా భూమిని కబ్జా చేసిన మున్నావర్‌పై చర్యలేవి
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నగర అర్సపల్లి శివారులోని తమ భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్ తనయుడు మున్నావర్‌పై చర్య తీసుకొని భూమిని మాకు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించడం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు కోర్టు నుంచి పోలీసు బందోబస్తు తీసుకున్నప్పటికీ కూడా తమ భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని, …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ డివిజన్ ఆనంద్ నగర్‌లో 10లక్షల జనరల్ ఫండ్‌తో చేపట్టే సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణమే తక్షణ కర్తవ్యంగా పనులు చేస్తున్నామని ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా …
Read More »రైల్వేలో, ఆర్టీసీ ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు రాయితీలను పునః ప్రారంభించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి కే.రామ్మోహన్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రలో ఆర్టీసి ప్రయాణాల్లో రాయితీలు ఆయారాష్ట్ర …
Read More »టీఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గురువారం టీఎన్‌జీఓల సంఘం ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల …
Read More »నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినత్సవం వేడుకలలో భాగంగా నిజామాబాద్ జిల్లా లోని అన్ని పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వారికి నిజామాబాద్ జిల్లా పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్గించే విధముగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదేవిధముగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ బాలుర వసతి గృహాలకు చెందిన 50 మంది బాలురను జిల్లాలోని అన్ని పర్యాటక …
Read More »జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవో 60 ప్రకారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి …
Read More »తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం అని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల …
Read More »హిందీ భారతీయులందరిని ఒకటిగా ఉంచే మూల మంత్రం
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ భాష భారతీయలందరిని ఏక సూత్రం మీద కలిపి ఉంచే మూల మంత్రమని ఎస్‌బిఐ సీనియర్ మేనేజర్ సురేష్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందీని మనం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి …
Read More »