నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్‌లైన్ సెంటర్‌లుగా సేవలందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ధరణి కార్యక్రమం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించాల్సి …
Read More »కార్యదీక్షా పరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, కార్య దీక్షా పరుడు, గొప్ప ఉద్యమ నేత, బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్థంతి సందర్బంగా బాపూజీ చిత్రపటానికి బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, …
Read More »డేగ కన్నులతో అడవిని పర్యవేక్షించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేందుకు వీలుగా ఇకపై భవిష్యత్తులో అడవుల నరికివేత ఎట్టి పరిస్థితుల్లో జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అడవుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరు భావించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందించాలన్నారు. పోడు భూముల సమస్యలపై మంత్రి …
Read More »ప్రసవాలకు ప్రైవేటుకు వెళ్తే విచారణ జరపాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఉదంతాలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్.ఎం లు మాట్లాడుతూ, …
Read More »మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి …
Read More »అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తే దోషులుగా నిలబెడతాం
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు …
Read More »అన్ని కేటగిరీల వారికి జీవన భృతిని ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం జీవన భృతిని ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »ప్రజావాణికి 55 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ …
Read More »ధూం..దాంగా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధూం.. దాంగా సాగాయి. కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలను ఆద్యంతం తిలకించిన ముఖ్య అతిథులు, ఆహుతులు కరతాళధ్వనులతో అభినందించారు. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …
Read More »