District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

సృజనాత్మకతను ఆవిష్కరింపజేసిన ముగ్గుల పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ గ్రౌండ్లో నిర్వహించిన రంగోళీ పోటీలు మహిళల సృజనాత్మకతను ఆవిష్కరింపజేశాయి. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని, దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా పలువురు రంగవల్లులు వేయగా, మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, …

Read More »

శ్రీనగర్‌ బాలహనుమాన్‌ ఆలయంలో జన్మాష్టమి వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని శ్రీనగర్‌ బాలహనుమాన్‌ ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారి అలంకరణ, నైవేద్యం ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీ కృష్ణ నినాదాలతో మారుమోగింది.

Read More »

అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని స్థానిక స్టేషన్‌ రోడ్డులోగల అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానునికి నవవిధ అభిషేకాలు, లోక కళ్యాణార్థం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ప్రధాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్‌ ఉపన్యసిస్తూ భాగవతంలో …

Read More »

ముగిసిన ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం కప్‌ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిసాయి. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్‌ వర్సెస్‌ పోలీస్‌ కమిషనర్‌ జట్ల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ రసవత్తరంగా సాగింది. కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయం

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ 372 వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్‌లో నెలకొల్పిన సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని …

Read More »

ఆకర్షణీయమైన చేతిరాతపై విద్యార్థులకు శిక్షణ

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాతను అందంగా, ఆకర్షణీయంగా ఎలా మల్చుకోవాలనే దానిపై శిక్షణ అందించారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది, పదవ తరగతుల విద్యార్థులకు గురువారం స్థానికంగానే ఆర్మూర్‌ పట్టణంలో …

Read More »

ప్రాంగణ నియామాకల్లో 9 మంది ఎంపిక

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ డిగ్రీ కళాశాలలో ముథూట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ వారు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 9 మంది అబ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయని కేర్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఎన్నికైన అభ్యర్థులకు ఆన్రోల్‌ ఉద్యోగం వెంబడే ఇస్తామని ముత్తుట్‌ ఫైనాన్స్‌ రీజియనల్‌ మేనేజర్‌ కొండ ఉపేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో కేర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బాలకృష్ణ, ప్రతినిధి కొయ్యాడ …

Read More »

రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకుని రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు …

Read More »

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 3 నెలల పెండిరగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌లకు మూడు నెలలుగా వేతనాలు …

Read More »

హుషారుగా సాగిన కవి సమ్మేళనం -ముషాయిరా

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. కార్యక్రమాలకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించగా, నగర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »