హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 లో టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …
Read More »పనులు పూర్తయిన వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ మన ఊరు – మన బడి పనుల …
Read More »జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం మరువలేనిది
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన సందర్భంగా జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిది కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి నిజామాబాద్ లో పాలనాధికారిగా విధులు నిర్వహించి, వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, …
Read More »బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ …
Read More »నిజామాబాద్‌కు కొత్త కలెక్టర్
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్ కు బాధ్యతలు. వికారాబాద్ కలెక్టర్ గా నారాయణ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ గా షేక్ యస్మిన్ బాషాకు బాధ్యతలు. మహబూబ్ నగర్ కలెక్టర్ గా రవి. సూర్యపెట్ కలెక్టర్ గా వెంకట్ రావు. రంగారెడ్డి కలెక్టర్ గా …
Read More »కంటి వెలుగు శిబిరాల నిర్వహణ భేష్
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చక్కటి సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని, కంటి వెలుగు శిబిరాలు ముగిసేంత వరకు కూడా ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం సాయంత్రం …
Read More »ఏసీడి చార్జీలను రద్దు చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసీడి పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు చార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఐటిఐ నుండి వర్ని చౌరస్తాలో గల విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఎస్.ఈ స్పందించకపోవడంతో ప్రజాపంథా నాయకులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే …
Read More »వారం రోజుల్లోపు పోడు భూముల ప్రక్రియను పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని, అర్హులైన వారికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పోడు భూములకు …
Read More »పోడు పట్టాలను సిద్ధం చేయండి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం …
Read More »వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి
నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »