నిజామాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ నిజామాబాద్ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను, విశ్వశాంతి జూనియర్ కళాశాలను, కాకతీయ జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్ బాలుర జూనియర్ కళాశాల (ఖిల్లా), …
Read More »నిజామాబాద్ చేరుకున్న ఆర్‌పీఎఫ్ బైక్ ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన అధికారులు, సిబ్బంది దేశ వ్యాప్తంగా చేపట్టిన బైక్ ర్యాలీ మంగళవారం నిజామాబాద్ చేరుకుంది. రైల్వే శాఖలోని వివిధ జోన్లకు చెందిన సుమారు 40 మంది 2021 మార్చి నెలలో సబర్మతి వద్ద ర్యాలీని ప్రారంభించి వివిధ …
Read More »నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు చేపట్టండి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీసేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఆయా శాఖల ప్రగతి పై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలో …
Read More »పారదర్శకంగా వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారులుగా కొనసాగిన వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసే ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తయ్యింది. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఆయన ఛాంబర్‌లో జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వీఆర్వోలను డ్రా …
Read More »ప్రజావాణి పెండిరగ్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …
Read More »నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 1వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ శానిటైజర్ బాటిల్ తోపాటు అవసరమైతే మంచినీటి బాటిల్ కూడా …
Read More »ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల బహుళ ప్రయోజనాలు
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆయన తన ఛాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే పేర్లు కలిగి ఉన్న వారు ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా సమర్పించాల్సిన …
Read More »292 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించామని జిల్లా పౌర సంబంధాల అధికారి చంద్రప్రకాష్ తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీ సందర్భంగా లారీలో తరలిస్తున్న 292 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యం పట్టుబడిరదని వివరించారు. బియ్యం నిల్వలను కరీంనగర్ …
Read More »నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవు
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాధి నివారణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. పన్నెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన విద్యార్థులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సంబంధిత …
Read More »అక్రిడిటేషన్ కార్డులు అందజేసిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 -24 సంవత్సరాలకు గాను పత్రిక విలేఖరులకు అందజేసే అక్రిడిటేషన్ కార్డులను మొదటగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తన ఛాంబర్లో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అందజేశారు. మొదటి విడతగా 470 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.పద్మశ్రీ, కమిటీ సభ్యులు ఆర్.వెంకటేశ్వర్లు, ఏ.నర్సింలు, జూపల్లి రమేష్, …
Read More »