District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు …

Read More »

మీ ఇంట్లో ఇన్నోవేటర్‌ ఉన్నారా

నిజామాబాద్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలోచనలకు పదును పెట్టడమే కాకుండా సైన్స్‌ పై ఆసక్తి పెంచి వారిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి ఇంటింటా ఎన్నోవేటర్‌ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఆవిష్కరణలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో ప్రధానంగా సాధారణ జీవన విధానంలో వృత్తి వ్యాపారంలో తలెత్తే సమస్యలు సవాళ్లను పరిష్కరించుకునేందుకు స్వీయ ఆలోచనలతో స్థానికంగా …

Read More »

ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ (పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐఎఫ్‌డిఎస్‌, పిఎస్‌యు, ఏఐఎస్‌బి, పిడిఎస్‌యు) ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్‌ నాయకత్వంలోని …

Read More »

వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వివిధ రోగాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దోమలు, ఈగలు పెరగడం వలన మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. అక్కడక్కడా డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తక్షణంగా చర్యలు తీసుకోవాలని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ గౌరవాధ్యక్షులు డాక్టర్‌ జయనీ నెహ్రు, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ …

Read More »

ప్రేమించడం లేదని యువతి గొంతుకోసిన సమీప బంధువు

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదనీ యువతి బంధువు ఆమె గొంతు కోసిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం చిన్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతికి మాక్లూర్‌ మండలం మాణిక్‌ భందడార్‌కు చెందిన సుంకరి సంజయ్‌ కుమార్‌ దూరపు బందువు. అయితే సంజయ్‌ తనను …

Read More »

త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్ధులకు అఖిలపక్ష నేత సంఫీుభావం

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్రిపుల్‌ ఐటి బాసర విద్యార్థులకు రాష్ట్ర అఖిల పక్షం నేతలు సంఫీుభావం తెలిపారు. బాసర విద్యార్థులు విష ఆహారానికి గురైన దరిమిలా నిజామాబాద్‌ హోప్‌ ఆసుపత్రికి పలువురు నేతలు వచ్చి పరామర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ హోప్‌ ఆసుపత్రిని సందర్శించి ఫుడ్‌ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా …

Read More »

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిని కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం సమీక్షించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, వ్యవసాయ, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులను క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో శాఖ …

Read More »

పీజీ పరీక్షలు రీ షెడ్యూల్‌

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై 16వ తేదీన ప్రారంభం కావాల్సిన పీజీ మొదటి సంవత్సర పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా, రవాణా సదుపాయం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లు గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల …

Read More »

సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజుల నుండి ఏకధాటిగా కురిసిన వర్షాల కారణంగా ప్రజావసరాలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు కలెక్టర్‌ శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. వర్షాలు నిలిచిపోయినందున సహాయక చర్యలను వేగవంతం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »