నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అతి త్వరలోనే కారుణ్య నియామకాల ద్వారా 1200 సిబ్బందిని విడతల వారీగా నియమిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడిరచారు. శుక్రవారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుమల బస్సులను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ గోవర్ధన్ మాట్లాడుతూ టిఎస్ ఆర్‌టిసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1016 నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌టిసికి చెల్లించాల్సిన ప్రభుత్వ బకాయిలు త్వరలో చెల్లించడం జరుగుతుందని …
Read More »సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలువాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభం కానున్న మండల స్థాయి రెవెన్యూ సదస్సులను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్‌లకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి …
Read More »దాతల తోడ్పాటును సద్వినియోగం చేసుకుని కొలువులు సాధించాలి
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు దాతల తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. ఈనాడు/ఈటీవీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఉపయోగార్థం దాతల నుండి సుమారు 7.50 లక్షల రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్ సేకరించి లైబ్రరీలకు సమకూర్చారు. ఇందులో భాగంగానే శుక్రవారం …
Read More »జోయాలుక్కాస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ వ్యాపార సంస్థ అయిన జోయాలుక్కాస్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రశంసించారు. సుభాష్ నగర్‌లోని బాలసదన్ లో వసతి పొందుతున్న నలభై మంది అనాధ బాలలకు జోయాలుక్కాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే సామాగ్రిని ఉచితంగా సమకూర్చారు. బాలసదన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి …
Read More »ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ముప్పు
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన నిత్యజీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్ సంచుల స్థానంలో బట్ట సంచులు వాడి పర్యావరణాన్ని రక్షించుకుందామని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు డా. జయనీ నెహ్రూ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా పంపిణీ కోసం తయారుచేసిన బట్ట సంచులను శుక్రవారం ఖలీల్‌వాడి స్వగృహంలో ఆమె విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆమె …
Read More »ఆయిల్ పామ్ సాగు…లాభాలు బహు బాగు
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో అత్యధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో స్థానిక సర్పంచ్ చిన్నారెడ్డి పదెకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగును ఎంచుకోగా, కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, గురువారం లాంఛనంగా ఆయిల్ …
Read More »దళిత బంధుతో వ్యాపారవేత్తలుగా ఎదగాలి
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాలు ఆర్ధిక అభ్యున్నతిని సాధించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికైన వారు మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన యూనిట్‌ను స్థాపించుకుని, ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితబంధు కింద ప్రభుత్వం …
Read More »సీనియర్ సిటిజన్లకు అర్.టి.సి.లో రాయితీలు ఇవ్వాలి
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నందు ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కి నిజామాబాదులో ఆయన కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళ్‌నాడు తదితర రాష్ట్రాల్లో ఈపాటికే సీనియర్ సిటిజన్లకు అన్ని …
Read More »ప్రతి ఒక్కరూ దోమ తెరలు వినియోగించాలి
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకాటుకు గురై డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా దోమ తెరలు వినియోగించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ప్రాధాన్యతను గుర్తిస్తూ ఉద్యమం తరహాలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వైద్యారోగ్య శాఖ పనితీరును సమీక్షించారు. ఈ …
Read More »వానాకాలం… వాహనదారులకు గమనిక
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వానాకాలం మొదలైంది…. అందరికీ తెలిసిందే… అయితే మీరు టూ వీలర్, ఫోర్ వీలర్ కలిగి ఉన్నారా… అయితే మీకో విన్నపం. వానాకాలం కాబట్టి వర్షపునీరు రోడ్డుపై అక్కడక్కడ నిలిచి ఉంటుంది. మట్టి రోడ్లయితే రోడ్డంతా చిత్తడిగా, బురద బురదగా మారుతుంది. అక్కడి నుండి నడుచుకుంటూ ఆఫీసులకు, కాలేజీలకు, పాఠశాలలకు వెళ్లే వారు కనబడితే మీ వాహనం కాస్త జాగ్రత్తగా …
Read More »